- తొలి భారతీయ అమెరికన్ మేయర్‌గా నిత్యా రామన్ రికార్డు
- గృహవసతి, నిరాశ్రయుల సమస్యలపై నిత్యా దృష్టి
- కేరళంలో జన్మించిన నిత్యా ఆరేళ్ల వయసులో కుటుంబంతో కలిసి అమెరికాకు
- హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ పూర్తి
- 2020, 2024లో లాస్ ఏంజెల్స్ సిటీ కౌన్సిల్‌కు ఎన్నిక
అమెరికాలో భారత సంతతికి చెందిన నిత్యా రామన్ అరుదైన ఘనత సాధించారు. లాస్‌ఏంజిల్స్ మేయర్‌గా ఆమె ఎన్నికయ్యారు. దీంతో ఈ నగరానికి మేయర్‌గా ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్‌గా, తొలి దక్షిణాసియా వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ప్రస్తుత మేయర్ కరెన్ బాస్ ఓటమిని అంగీకరించడంతో నిత్యా విజయం ఖరారైంది.
లాస్‌ఏంజెల్స్ కౌంటీ ఎన్నికల తాజా లెక్కల ప్రకారం నిత్యాకు 4,60,772 ఓట్లు (52.70 శాతం) వచ్చాయి. కరెన్ బాస్‌కు 4,13,519 ఓట్లు (47.30 శాతం) లభించాయి. ఇద్దరి మధ్య 47,253 ఓట్ల తేడా ఉంది. అయితే బ్యాలెట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతుండటంతో ఫలితాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది.
ఓటమిని అంగీకరించిన కరెన్ బాస్.. నిత్యాకు ఫోన్ చేసి అభినందించారు. అధికార మార్పిడి సజావుగా జరిగేలా సహకరిస్తానని తెలిపారు. మరోవైపు తన విజయంపై నిత్యా స్పందిస్తూ.. లాస్‌ఏంజెల్స్‌కు తదుపరి మేయర్‌గా ఎన్నిక కావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని ఎక్స్‌లో పేర్కొన్నారు.
నగరంలో గృహవసతి ఖర్చులు తగ్గించడం, నిరాశ్రయుల సమస్యను పరిష్కరించడం, ప్రజా రవాణాను మెరుగుపరచడం తన ప్రధాన లక్ష్యాలని నిత్యా ప్రకటించారు. రోడ్లపై గుంతలు పూడ్చడం, వీధి దీపాల మరమ్మతులు వేగవంతం చేయడం, పోలీసు వ్యవస్థలో మార్పులు తీసుకురావడంపైనా హామీలు ఇచ్చారు.
కేరళంలో జన్మించిన నిత్యా ఆరేళ్ల వయసులో కుటుంబంతో కలిసి అమెరికాకు వెళ్లారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదివిన ఆమె.. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో అర్బన్ ప్లానింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. నిరాశ్రయుల సమస్యపై పనిచేశారు. 2020లో లాస్‌ఏంజెల్స్ సిటీ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. 2024లోనూ విజయం సాధించారు.