Garudavega: ప్రెస్ నోట్: కొత్త నిబంధనలతో తమ సేవలు కొనసాగించనున్న గరుడవేగ

Garudavega Shipping to USA Under Revised Guidelines
 
ప్రెస్ నోట్:  అంతర్జాతీయ లాజిస్టిక్స్ మరియు క్రాస్-బోర్డర్ షిప్పింగ్‌లో విశ్వసనీయమైన సంస్థ గరుడవేగ – నెక్స్జెన్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, 2025 ఆగస్టు 29 నుండి అమల్లోకి వచ్చిన డి మినిమిస్ రూల్ రద్దు తరువాత సవరించిన అమెరికా కస్టమ్స్ మార్గదర్శకాలను అనుసరిస్తూ USAకి తన షిప్పింగ్ సేవలను కొనసాగించనున్నట్లు ప్రకటించింది.

చట్టబద్ధంగా నడిచే సంస్థగా గరుడవేగ, అమెరికా కస్టమ్స్ నిబంధనలకు పూర్తిగా అనుగుణంగా ఉండటమే కాకుండా, ప్రతి పార్సెల్ కొత్త విధానాలకు కచ్చితంగా అనుసరించేలా కట్టుబడి ఉంది. కస్టమర్లు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు USAకి పార్సెల్‌లు పంపేటప్పుడు సవరించిన మార్గదర్శకాలను జాగ్రత్తగా పాటించాలని సూచించబడుతున్నారు.

ఈ పరిణామంపై సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ:

“మా కస్టమర్లందరికీ హామీ ఇస్తున్నాం – USAకి మా సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతాయి. కొత్త నిబంధనలు కొన్ని అదనపు అవసరాలను తీసుకువచ్చినా, గరుడవేగ వాటిని పూర్తిగా అనుసరిస్తోంది. అన్ని కస్టమర్లకు సహాయం అందించేందుకు మా సిబ్బంది మరియు బ్రాంచ్ కార్యాలయాలు సిద్ధంగా ఉన్నాయి. షిప్మెంట్ల ప్రాసెసింగ్ సాఫీగా సాగేందుకు మేము పూర్తి స్థాయి మార్గనిర్దేశం అందిస్తాము.” అని తెలిపారు.

కస్టమర్లు ఏవైనా సందేహాలు, మార్గదర్శకాలు లేదా వివరణల కోసం తమ సమీపంలోని బ్రాంచ్ లేదా సిబ్బంది ప్రతినిధులను సంప్రదించవచ్చు.

మరిన్ని వివరాల కోసం దయచేసి సంప్రదించండి:

గరుడవేగ – నెక్స్జెన్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్

Garudavega – Nexgen Logistics Pvt. Ltd.

వెబ్‌సైట్: www.garudavega.com

కస్టమర్ కేర్: +91 9059958342

Content Produced by Indian Clicks, LLC
Garudavega
Nexgen Logistics
USA Shipping
International Logistics
Cross Border Shipping
US Customs
D Minimis Rule
Shipping to USA
Parcel Shipping

More Telugu News