పోగాలం ఎవరికి దాపురించిందో 2019 నుంచీ చూస్తున్నాం: మంత్రి కన్నబాబు
- చంద్రబాబు మరో రసం పీల్చే పురుగు
- 2019లో చంద్రబాబుకు ప్రజలు పురుగు మందు కొట్టారు
- ఏపీని చంద్రబాబు భ్రష్టు పట్టించారు
ఆంధ్రప్రదేశ్ ని చంద్రబాబు భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రయోజనాలు అంటే రియలెస్టేట్ ప్రయోజనాలని చంద్రబాబు అనుకున్నారని విమర్శించారు. సొంత మనుషుల చేత భూములు కొనిపించి అమరావతి రాజధాని పెట్టారని ఆరోపించారు. భూముల వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బుతో రాజకీయం చేయడం చంద్రబాబుకు అలవాటని అన్నారు.