కెనడాలో భారత యువతి దారుణ హత్య.. టార్గెట్ చేసి కాల్చివేత
- టొరంటోలో 26 ఏళ్ల నవనీత్ కౌర్‌పై కాల్పులు
- ఇది టార్గెటెడ్ దాడి అని నిర్ధారించిన పోలీసులు
- నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
కెనడాలో భారత సంతతికి చెందిన యువతి దారుణ హత్యకు గురైంది. పంజాబ్‌కు చెందిన 26 ఏళ్ల నవనీత్ కౌర్‌ను టొరంటోలో పట్టపగలే కాల్చి చంపారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడి అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి పంజాబ్‌కే చెందిన 37 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
టొరంటో పోలీసుల కథనం ప్రకారం, జూలై 24వ తేదీ ఉదయం 7:23 గంటల సమయంలో ఎటోబికోక్ ప్రాంతంలోని హంబర్‌వుడ్ బౌలేవార్డ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పులు జరిగినట్లు సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, తీవ్ర గాయాలతో పడి ఉన్న నవనీత్‌ను గుర్తించారు. వైద్య సిబ్బంది ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రవీకరించారు.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, నిందితుడు నవనీత్‌ను వెంబడించి, ఆమెతో కొద్దిసేపు సంభాషించిన అనంతరం ఒక్కసారిగా కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే వారిద్దరి మధ్య ఎలాంటి వాగ్వాదం జరిగినట్లు కనిపించలేదని సాక్షులు తెలిపారు. ఈ ఘటన అనంతరం పోలీసులు డ్రోన్లు, డాగ్ స్క్వాడ్‌లతో ముమ్మర గాలింపు చేపట్టారు. నిందితుడిని బ్రాంప్టన్‌కు చెందిన శరణ్‌జిత్ సింగ్‌గా గుర్తించిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు.