రూ.100 కోట్లకు పైగా ఆదాయం చూపుతున్న వారి సంఖ్యలో భారీ పెరుగుదల!
- 576కు పెరిగిన రూ.100 కోట్ల ఆదాయం ఉన్నవాళ్లు
- ఐదేళ్లలో దాదాపు 300 శాతం వృద్ధి
- లోక్‌సభలో కేంద్రం వెల్లడించిన గణాంకాలు
- ‘బిలియనీర్’కు చట్టంలో నిర్వచనం లేదన్న స్పష్టత
- ఆదాయ అసమానత తగ్గిందన్న కేంద్రం
దేశంలో ఏడాదికి రూ.100 కోట్లకు పైగా ఆదాయం ప్రకటిస్తున్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య గత ఐదేళ్లలో గణనీయంగా పెరిగింది. ఈ సంఖ్య దాదాపు నాలుగు రెట్లు పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు వెల్లడించారు.
2025-26 అసెస్‌మెంట్ సంవత్సరంలో రూ.100 కోట్లకు మించి వార్షిక ఆదాయం ప్రకటించిన వారి సంఖ్య 576కు చేరిందని తెలిపారు. 2021-22లో ఈ సంఖ్య 142 మాత్రమే ఉండేదని చెప్పారు. అంటే ఐదేళ్ల వ్యవధిలో దాదాపు 300 శాతం పెరుగుదల నమోదైనట్లు వివరించారు. 2022-23లో ఈ సంఖ్య 301కు చేరగా, 2023-24లో స్వల్పంగా తగ్గి 284గా నమోదైంది. ఆ తర్వాత 2024-25లో 415కు పెరిగి, 2025-26లో 576కు చేరింది.
ఆదాయపు పన్ను చట్టం-2025లో ‘బిలియనీర్’ అనే పదానికి ప్రత్యేక నిర్వచనం లేదని కేంద్రం స్పష్టం చేసింది. అందువల్ల ఆదాయపు పన్ను రిటర్నుల్లో రూ.100 కోట్లకు పైగా ఆదాయం ప్రకటించిన వ్యక్తుల వివరాలను మాత్రమే అందించినట్లు పేర్కొంది. ఈ గణాంకాలు పన్ను రిటర్నుల ఆధారంగా సేకరించినవేనని వెల్లడించింది.
దేశంలో ఆదాయ అసమానతలపై అడిగిన ప్రశ్నకు కూడా కేంద్రం సమాధానం ఇచ్చింది. ‘హౌస్‌హోల్డ్ కన్సంప్షన్ ఎక్స్‌పెండిచర్ సర్వే’ (2023-24) ప్రకారం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆదాయ అసమానత తగ్గినట్లు తెలిపింది. అలాగే 15 ఏళ్లు పైబడిన వారి నిరుద్యోగ రేటు 2023-24లో 3.1 శాతానికి తగ్గిందని వెల్లడించింది. ఉపాధి కల్పన, ప్రగతిశీల పన్ను విధానం, ఆరోగ్యం, విద్య, గృహ నిర్మాణం, గ్రామీణాభివృద్ధిపై ప్రభుత్వ వ్యయం పెంచడం ద్వారా సమ్మిళిత ఆర్థిక వృద్ధికి కృషి చేస్తున్నట్లు కేంద్రం వివరించింది.