చంద్రుడి గుంతల వెనుక అసలు కథ ఇదే.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు
- చంద్రుడి గుంతలపై కొత్త అధ్యయనం
- చాంగ్‌ఈ-6 నమూనాల విశ్లేషణ
- గ్రహశకలాలు ఢీకొనడం క్రమంగా తగ్గినట్లు గుర్తింపు
- ‘లేట్ హెవీ బాంబార్డ్‌మెంట్’ సిద్ధాంతానికి సవాల్
- చంద్రుణ్ని ‘టైమ్ క్యాప్సూల్’గా పేర్కొన్న శాస్త్రవేత్తలు
- భూమిపై జీవం ఆవిర్భావంపై కొత్త ఆధారాలకు ఆశ
రాత్రివేళ ఆకాశంలో కనిపించే చంద్రుణ్ని గమనిస్తే పెద్ద పెద్ద మచ్చలు స్పష్టంగా కనిపిస్తాయి. అయితే అవన్నీ గుంతలు అనే విషయం శాస్త్రవేత్తలు ఎప్పుడో తేల్చారు. అయితే అవి ఎలా ఏర్పడ్డాయి? ఎందుకు అన్ని గుంతలు ఉన్నాయి? అనే ప్రశ్నకు శాస్త్రవేత్తలు తాజాగా కొత్త సమాధానం కనుగొన్నారు. చంద్రుడి అవతలి వైపు నుంచి చైనా తీసుకొచ్చిన రాతి నమూనాలపై నిర్వహించిన అధ్యయనంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పరిశోధన సౌర కుటుంబం తొలి దశ చరిత్రపై కొత్త అవగాహన కల్పిస్తోంది. చంద్రుడిపై కనిపించే గుంతల చరిత్రపై కొత్త ఆధారాలు లభించాయి.
భూమిపై గాలి, వర్షం, అగ్నిపర్వతాలు, భూకంపాల వంటి ప్రకృతి మార్పుల వల్ల పురాతన ఆనవాళ్లు చెరిగిపోతుంటాయి. కానీ చంద్రుడిపై అలాంటి మార్పులు చాలా తక్కువగా ఉండటంతో గ్రహశకలాలు, తోకచుక్కలు ఢీకొన్న ప్రతిసారి ఏర్పడిన గుంతలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అందుకే చంద్రుణ్ని గత చరిత్రను భద్రపరిచిన ‘టైమ్ క్యాప్సూల్’గా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు.
చైనా చేపట్టిన చాంగ్‌ఈ-6 మిషన్ చంద్రుడి అవతలి వైపు నుంచి రాతి నమూనాలను భూమికి తీసుకొచ్చింది. వాటిని పరిశీలించిన శాస్త్రవేత్తలు.. గతంలో భావించినట్లు ఒకేసారి భారీ సంఖ్యలో గ్రహశకలాలు ఢీకొనలేదని తేల్చారు. బిలియన్ల ఏళ్ల పాటు క్రమంగా ఢీకొట్టే ఘటనలు తగ్గుతూ వచ్చాయని గుర్తించారు.
పరిశోధకులు 4.33 బిలియన్ నుంచి 1.13 బిలియన్ సంవత్సరాల నాటి రాతి నమూనాలను విశ్లేషించారు. ఈ అధ్యయనం ప్రకారం ఒకప్పుడు భావించిన ‘లేట్ హెవీ బంబార్డ్‌మెంట్’ సిద్ధాంతానికి భిన్నమైన ఆధారాలు లభించాయి. సుమారు 4 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక్కసారిగా భారీ స్థాయిలో ఢీకొన్న ఘటనలకన్నా, కాలక్రమేణా వాటి సంఖ్య తగ్గుతూ వచ్చిందని వెల్లడైంది.
ఈ పరిశోధన భూమి చరిత్రను అర్థం చేసుకోవడంలో కూడా ఉపయోగపడనుంది. భూమి, చంద్రుడు రెండూ దాదాపు 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఒకే సమయంలో ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువల్ల చంద్రుడిని గ్రహశకలాలు ఢీకొట్టిన ఘటనలు.. అప్పటి భూమిపై కూడా ఎలాంటి పరిస్థితులు ఉండేవో అంచనా వేయడానికి దోహదపడతాయని భావిస్తున్నారు. భూమిపై జీవం ఆవిర్భావానికి ఈ ఘటనలు ఏమైనా కారణమయ్యాయా అనే అంశంపై కూడా మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.