జింబాబ్వే సిరీస్‌లో హీరో.. తన సక్సెస్ సీక్రెట్ చెప్పిన వైభవ్ సూర్యవంశీ
- జింబాబ్వే సిరీస్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా వైభవ్ సూర్యవంశీ
- తన విజయానికి కోచ్‌లు లక్ష్మణ్, కనిత్కరే కారణమని వెల్లడి
- వారు తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని తెలిపిన యువ సంచలనం
- సీనియర్ జట్టులో ఇషాన్ కిషన్‌తో ఉన్న చనువు కలిసిసొచ్చిందన్న వైభవ్
జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్‌స్వీప్ చేయడంలో కీలక పాత్ర పోషించిన యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ, తన అద్భుత ప్రదర్శన వెనుక ఉన్న రహస్యాన్ని వెల్లడించాడు. తాత్కాలిక హెడ్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్, బ్యాటింగ్ కోచ్ హృషికేశ్ కనిత్కర్ తనకు పూర్తి స్వేచ్ఛనివ్వడమే తన విజయానికి కారణమని తెలిపాడు. ఈ సిరీస్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వైభవ్ 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డును గెలుచుకున్నాడు.
ఈ సిరీస్‌లో భాగంగా హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో నిన్న జరిగిన చివరి మ్యాచ్‌లో వైభవ్ 49 బంతుల్లో 81 పరుగులు చేసి జట్టు భారీ స్కోరుకు బాటలు వేశాడు. మొత్తం మూడు ఇన్నింగ్స్‌లలో కలిపి 151 పరుగులు సాధించాడు. అంతకుముందు ఇంగ్లండ్ పర్యటనలో మూడు ఇన్నింగ్స్‌లలో కేవలం 42 పరుగులే చేసి నిరాశపరిచిన వైభవ్, ఈ సిరీస్‌తో తిరిగి ఫామ్‌లోకి రావడం విశేషం.
నేడు బీసీసీఐ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో వైభవ్ మాట్లాడాడు. "భారత సీనియర్ జట్టుకు ఆడటం, 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్', 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' గెలవడం నా కల నెరవేరినట్లే. నాకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ, ముఖ్యంగా సీనియర్లకు, కోచింగ్ సిబ్బందికి ధన్యవాదాలు. సిరీస్‌కు ముందు వీవీఎస్ సర్, హృషికేశ్ సర్ నాతో ప్రత్యేకంగా మాట్లాడారు. నా మానసిక పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చి, ఏమీ ఆలోచించకుండా నీ ఆట నువ్వు ఆడు అని చెప్పారు" అని వైభవ్ వివరించాడు.
అలాగే, జట్టులో తనకు ఎలాంటి ఒంటరి భావన కలగలేదని, ఇందుకు తన సొంత రాష్ట్రం బీహార్‌కు చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌తో ఉన్న చనువే కారణమని చెప్పాడు. "సీనియర్ జట్టులో ఉన్నాననే కొత్త ఫీలింగ్ లేదు. ఇషాన్ భయ్యా కూడా మా రాష్ట్రం వాడే కావడంతో మా మధ్య మంచి వైబ్ కుదిరింది. దీనివల్ల నేను అన్ని మ్యాచ్‌లను ఒకేలా ఆడగలుగుతున్నాను" అని వైభవ్ ఆనందం వ్యక్తం చేశాడు.