నేను స్ట్రీట్ ఫైటర్‌ను: జైరామ్ రమేశ్‌కు ధర్మేంద్ర ప్రధాన్ కౌంటర్

I am a street fighter Dharmendra Pradhan counters Jairam Ramesh
  • నీట్ వివాదంతో రాజీనామా తర్వాత పార్లమెంటుకు వచ్చిన ప్రధాన్
  • బీజేపీ, ఎన్డీయే ఎంపీల నుంచి ఘన స్వాగతం
  • ఇలా జరుగుతుంటుందన్న జైరామ్ రమేశ్
  • ఏసీ గదుల్లో ఉండే కార్యకర్తను కాదని వ్యాఖ్య
నీట్ పేపర్ లీకేజీ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్‌కు సోమవారం పార్లమెంటులో ఘన స్వాగతం లభించింది.

చిరునవ్వుతూ కారు దిగిన ధర్మేంద్ర ప్రధాన్, అందరికీ అభివాదం చేస్తూ లోపలికి వెళ్లారు. పలువురు అధికార పక్ష ఎంపీలు ఆయనకు సంఘీభావం తెలుపుతూ శాలువా కప్పి, సంప్రదాయ టోపీతో సత్కరించారు. ఎలాంటి ఆరోపణలు లేకపోయినా ఒక మంత్రి స్వచ్ఛందంగా రాజీనామా చేయడం ఇదే మొదటిసారని ఒక ఎంపీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

ఈ క్రమంలో పార్లమెంట్ కారిడార్‌లో కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్, ధర్మేంద్ర ప్రధాన్‌ను ఉద్దేశించి "అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటుంది" అని వ్యాఖ్యానించారు. దీనికి ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ, "ఏమీ జరగలేదు. నేను వీధి పోరాటాల నుంచి వచ్చిన యోధుడిని (స్ట్రీట్ ఫైటర్‌), ఏసీ గదుల్లో కూర్చునే కార్యకర్తను కాదు" అని కౌంటర్ ఇచ్చారు.

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో జరిగిన నిరసనల నేపథ్యంలో, ఆయన రాజీనామా చేయాలనే డిమాండ్ బలంగా వినిపించడంతో శనివారం ప్రధాన్ తన పదవి నుంచి తప్పుకున్నారు. దేశ వ్యతిరేక శక్తులు ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకోకూడదని, విద్యార్థుల భవిష్యత్తు చట్టపరమైన చిక్కుల్లో పడకూడదనే ఉద్దేశంతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన తన ప్రకటనలో స్పష్టం చేశారు.
Advertisement
Dharmendra Pradhan
Jairam Ramesh
NEET paper leak controversy
Parliament session
Education Minister resignation

More Telugu News