సీఎం విజయ్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. కరూర్ బాధితుల నియామకాలు రద్దు
- తొక్కిసలాట బాధితుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చే జీవోను కొట్టివేసిన మద్రాస్ హైకోర్టు
- ఈ నియామకాలు రాజ్యాంగంలోని సమానత్వ, సమాన అవకాశాల హక్కులకు విరుద్ధమని వ్యాఖ్య
- ప్రభుత్వ ఉద్యోగాలను విషాదాలకు పరిహారంగా ఇవ్వలేమన్న కోర్టు
కరూర్ తొక్కిసలాట బాధితుల కుటుంబాలకు కారుణ్య నియామకాల కింద ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఈ నియామకాలు రాజ్యాంగంలోని 14, 16 అధికరణాలకు (సమానత్వపు హక్కు, ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు) విరుద్ధమని పేర్కొంటూ సోమవారం కీలక తీర్పు వెలువరించింది.
జస్టిస్ సీవీ కార్తికేయన్, జస్టిస్ ఆర్. శక్తివేల్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేసింది. "విషాదకర ఘటనలు సంభవించినప్పుడు పరిహారంగా ప్రభుత్వ ఉద్యోగాలను పంపిణీ చేయలేరు. ఇది ఇప్పటికే కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న వారికి, విధి నిర్వహణలో ఉండి మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు అన్యాయం చేయడమే అవుతుంది" అని కోర్టు అభిప్రాయపడింది. ఇటువంటి నియామకాలను అనుమతిస్తే భవిష్యత్తులో అగ్నిప్రమాదాలు, రోడ్డు ప్రమాదాల వంటి ఇతర ఘటనలు జరిగినప్పుడు కూడా బాధితులు ఇదే తరహా డిమాండ్లు చేసే ప్రమాదం ఉందని ధర్మాసనం హెచ్చరించింది.
గత ఏడాది సెప్టెంబర్ 27న కరూర్‍లో ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ నిర్వహించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన విషయం తెలిసిందే. ఇటీవలే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్, తన కరూర్ పర్యటనలో బాధితుల కుటుంబాలకు చెందిన 31 మందికి వివిధ ప్రభుత్వ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్ వంటి ఉద్యోగాలకు సంబంధించిన నియామక పత్రాలను అందజేశారు. వారిలో ఇప్పటికే 29 మంది విధుల్లో చేరారు.
ఈ నియామకాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు, ప్రభుత్వ నిర్ణయం చట్టవిరుద్ధమని తేల్చింది. నేరుగా ఉద్యోగాలు కల్పించడానికి బదులుగా బాధితుల కుటుంబ సభ్యులకు నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపక శిక్షణ వంటివి అందించి, వారు స్వశక్తితో ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్సహించాలని ప్రభుత్వానికి సూచించింది.