భారత నగరాల్లో 'ఘోస్ట్ ఫ్లాట్లు'.. ఓవైపు ఇళ్ల కొరత, మరోవైపు ఖాళీ అపార్ట్‌మెంట్లు!
- దేశంలోని ప్రధాన నగరాల్లో వేల సంఖ్యలో ఖాళీగా ఫ్లాట్లు
- నగరాల్లో దర్శనమిస్తున్న ఘోస్ట్ ప్లాట్లు
- పెట్టుబడి కోసం కొనడం, అధిక అద్దెలు, సౌకర్యాల కొరత ప్రధాన కారణాలు
దేశంలో కోట్లాది మంది సామాన్యులు సొంత ఇంటి కల కోసం అహర్నిశలు శ్రమిస్తుంటే, మరోవైపు ప్రధాన నగరాల్లో నిర్మాణం పూర్తయిన వేలాది అపార్ట్‌మెంట్లు వినియోగంలో లేక వెలవెలబోతున్నాయి. రియల్ ఎస్టేట్ పరిభాషలో వీటిని 'ఘోస్ట్ ఫ్లాట్స్' లేదా 'ఘోస్ట్ ప్రాపర్టీస్' అని పిలుస్తారు. దేశీయ గృహ నిర్మాణ రంగంలో నెలకొన్న ఈ విచిత్ర వైరుధ్యం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
యాజమాన్య హక్కులు ఉండి, నివాసానికి సర్వం సిద్ధంగా ఉన్నప్పటికీ ఈ గృహాల్లో ఎవరూ నివసించడం లేదు. కేవలం ఒక పెట్టుబడి సాధనంగా వీటిని కొనుగోలు చేసి, భవిష్యత్తులో గరిష్ట లాభాలకు విక్రయించాలనే ఉద్దేశంతో చాలామంది వీటిని ఖాళీగా వదిలేస్తున్నారు. వీటికి తోడు అధిక అద్దెలు, రవాణా సౌకర్యాలు లేమి, సమీపంలో పాఠశాలలు, ఆసుపత్రులు వంటి కనీస వసతులు అందుబాటులో లేకపోవడం వల్ల కూడా ప్రజలు ఇక్కడ నివసించేందుకు మొగ్గు చూపడం లేదు. ముఖ్యంగా నోయిడా, గ్రేటర్ నోయిడా వంటి ప్రాంతాల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తోంది.
అపార్ట్‌మెంట్లు ఖాళీగా ఉండటం వల్ల ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి చెందాల్సిన వ్యాపార సముదాయాలు, పాఠశాలలు మరియు ఇతర అనుబంధ రంగాలు దెబ్బతింటున్నాయి. మరికొన్ని చోట్ల చట్టపరమైన వివాదాలు, అనుమతులలో జాప్యం, పరిపాలనాపరమైన అడ్డంకుల వల్ల ప్రాజెక్టులు నిలిచిపోయి నిరుపయోగంగా మారుతున్నాయి. చైనా, స్పెయిన్ వంటి దేశాల్లోనూ ఇలాంటి 'ఘోస్ట్ సిటీ'ల సమస్య ఉన్నప్పటికీ, తీవ్రమైన గృహ కొరత ఎదుర్కొంటున్న భారత వంటి దేశంలో ఈ పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది.