- దార్చా ఘాట్ రోడ్లపై జీఎంసీ హమ్మర్ ఈవీ క్రాబ్‌వాక్ విన్యాసం వైరల్
- నాలుగు చక్రాలు ఒకే దిశలో తిరుగుతూ పీతలా పక్కకు కదిలిన కారు
- ఇరుకైన హిమాలయ దారులు, ఆఫ్ రోడింగ్‌కు అనువైన సాంకేతికత
- నాలుగు టన్నుల బరువుతో దాదాపు 1,000 హార్స్‌పవర్ శక్తి ఉత్పత్తి
- ప్రైవేట్ దిగుమతుల ద్వారా భారత్‌లో దీని ధర రూ.3 కోట్లకు పైమాటే
హిమాలయ పర్వత శ్రేణుల్లోని అత్యంత క్లిష్టమైన ఘాట్ రోడ్లపై ఒక భారీ విద్యుత్ ఎస్‌యూవీ పీతలా పక్కకు నడుస్తూ వెళ్తుంటే చూసేవారికి కళ్లు తిరగడం ఖాయం. హిమాచల్ ప్రదేశ్‌లోని దార్చా సమీపంలో ‘జీఎంసీ హమ్మర్ ఈవీ’ తన ప్రత్యేకమైన 'క్రాబ్‌వాక్' ఫీచర్‌ను ప్రదర్శిస్తూ రోడ్డుపై దూసుకెళ్లిన వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. భారతదేశంలో అధికారికంగా విడుదల కాని ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ సూపర్‌ట్రక్ హిమాలయాల మంచు కొండల్లో కనిపించడమే ఒక అద్భుతమైతే, ఇలాంటి కఠినమైన మలుపుల్లో డయాగ్నల్‌గా నడవడం ఆటోమొబైల్ ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
సాధారణంగా వాహనాల్లో ముందు చక్రాలు మాత్రమే అటూఇటూ తిరుగుతాయి. కానీ హమ్మర్ ఈవీలో ఉన్న ఫోర్-వీల్ స్టీరింగ్ వ్యవస్థ సాయంతో తక్కువ వేగంలో నాలుగు చక్రాలు ఒకే దిశలో తిరుగుతాయి. దీనివల్ల వాహనం పీత మాదిరిగా పక్కకు (డయాగ్నల్) కదులుతుంది. ఇరుకైన పర్వత దారులు, రాళ్లతో కూడిన ఆఫ్ రోడింగ్ ప్రదేశాలు, అడ్డంకులు ఎదురైనప్పుడు ఇంతటి భారీ వాహనాన్ని ముందుకు నడపడానికి ఈ క్రాబ్‌వాక్ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ ఎలక్ట్రిక్ కారు కొలతలు చూస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. 5,507 ఎంఎం పొడవు, 2,201 ఎంఎం వెడల్పు, 2,060 ఎంఎం ఎత్తుతో రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్, టయోటా ల్యాండ్‌క్రూజర్ వంటి లగ్జరీ కార్ల కంటే పెద్దగా ఉంటుంది. నాలుగు టన్నులకు పైగా బరువుండే ఈ వెహికల్‌లో ఉన్న ట్రై-మోటార్ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ ఏకంగా 1,000 హార్స్‌పవర్, సుమారు 15,500 ఎన్ఎం వీల్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఇంతటి భారీ బరువుతోనూ కేవలం 3.5 సెకన్లలోనే 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకుని సూపర్ కార్లను తలపిస్తుంది. ఎయిర్ సస్పెన్షన్, ఎక్స్‌ట్రాక్ట్ మోడ్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లకు పైగా రేంజ్ దీని సొంతం. భారత్‌లో ఇది అధికారికంగా లభించదు. ప్రైవేట్ దిగుమతుల ద్వారా తీసుకొస్తే పన్నులతో కలిపి దీని ధర సుమారు రూ.3 కోట్లకు పైగానే ఉంటుంది. బాలీవుడ్‌లో హీరో రణ్‌వీర్ సింగ్, డైరెక్టర్ రోహిత్ శెట్టి వద్ద ఈ అరుదైన హమ్మర్ ఈవీ ఉంది.