- భారత్‌లో రూ.58 వేల కోట్ల పైచిలుకు పెట్టుబడి
- కర్ణాటక మధ్యప్రదేశ్ రాజస్థాన్‌లలో నాలుగు భారీ ప్రాజెక్టుల ప్రకటన
- 2 గిగావాట్లకు చేరనున్న అమెజాన్ హరిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం
- అమెజాన్ నిర్ణయాన్ని స్వాగతించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
- 2040 నాటికి నెట్ జీరో కర్బన ఉద్గారాలే లక్ష్యమన్న సంస్థ
భారత్‌లో పర్యావరణహిత పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను విస్తరించేందుకు ప్రముఖ అంతర్జాతీయ ఈ-కామర్స్, క్లౌడ్ సేవల దిగ్గజం అమెజాన్ భారీ ప్రణాళికను ప్రకటించింది. 2030 నాటికి దేశంలో అదనంగా మరో 7 బిలియన్ డాలర్లను (సుమారు రూ.58 వేల కోట్లకు పైగా) గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే భారత్‌లో పునరుత్పాదక ఇంధన ఒప్పందాల కోసం 4 బిలియన్ డాలర్లను కేటాయించిన సంస్థ, తాజా నిర్ణయంతో తన విస్తరణను మరింత వేగవంతం చేయనుంది. తద్వారా దేశంలో కర్బన రహిత విద్యుత్‌ను అత్యధికంగా కొనుగోలు చేస్తున్న కార్పొరేట్ సంస్థలలో ఒకటిగా అమెజాన్ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.
ఇప్పటికే కేటాయించిన 4 బిలియన్ డాలర్ల నిధుల్లో భాగంగా, మొత్తం 934 మెగావాట్ల (MW) సంయుక్త సామర్థ్యంతో కూడిన నాలుగు సరికొత్త విండ్, సోలార్ ప్రాజెక్టులను అమెజాన్ ప్రకటించింది. వీటిలో కర్ణాటకలో 234 మెగావాట్ల భారీ విండ్ ప్రాజెక్ట్‌తో పాటు మరో 200 మెగావాట్ల హైబ్రిడ్ విండ్-సోలార్ ప్రాజెక్ట్ ఉన్నాయి. ఇందులో 234 మెగావాట్ల విండ్ ప్రాజెక్ట్ ఆసియాలోనే అమెజాన్ చేపట్టిన అత్యంత భారీ పవన విద్యుత్ ఒప్పందం కావడం విశేషం. వీటితో పాటు మధ్యప్రదేశ్‌లో 300 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్, రాజస్థాన్‌లో 200 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయనున్నారు.
ఈ నాలుగు ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, భారత్‌లో అమెజాన్ కాంట్రాక్ట్ చేసుకున్న పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2 గిగావాట్లకు (GW) పైగా చేరుకుంటుంది. ఈ విద్యుత్ దాదాపు 35 లక్షలకు పైగా భారతీయ గృహాల వార్షిక విద్యుత్ అవసరాలను తీర్చడానికి సమానమని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమెజాన్‌కు సంబంధించి 14 భారీ విండ్, సోలార్ ప్రాజెక్టులతో పాటు 43 ఆన్-సైట్ సోలార్ యూనిట్లు పనిచేస్తున్నాయి. అంతర్జాతీయంగా చూస్తే అమెజాన్ ఆధ్వర్యంలో 40 గిగావాట్లకు పైగా సామర్థ్యంతో సుమారు 700 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి.
ఈ అదనపు 7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు అమెజాన్ ప్రపంచవ్యాప్త పర్యావరణ లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయని సంస్థ తెలిపింది. 2019 స్థాయితో పోలిస్తే, 2030 నాటికి తమ కార్యకలాపాలకు వినియోగించే విద్యుత్ ద్వారా వెలువడే కర్బన ఉద్గారాల తీవ్రతను 65 శాతం మేర తగ్గించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ‘ది క్లైమేట్ ప్లెడ్జ్’ ఒప్పందంలో భాగంగా 2040 నాటికి తమ అన్ని వ్యాపార కార్యకలాపాల్లో ‘నెట్ జీరో’ కర్బన ఉద్గారాల స్థాయికి చేరుకోవాలని అమెజాన్ భావిస్తోంది.
అమెజాన్ తీసుకున్న ఈ భారీ నిర్ణయాన్ని కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్వాగతించారు. భారత హరిత ఇంధన రంగంపై అంతర్జాతీయ సంస్థలకు పెరుగుతున్న విశ్వసనీయతకు ఈ పెట్టుబడులే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ నిధుల రాకతో దేశీయ విద్యుత్ గ్రిడ్ ఆధునీకరణ వేగవంతం కావడంతో పాటు, నూతన ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఇంధన భద్రత పెరుగుతుందని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా, 2070 నాటికి భారత్ నిర్దేశించుకున్న ‘నెట్ జీరో’ లక్ష్య సాధనకు ఈ తరహా భారీ ప్రైవేట్ భాగస్వామ్యాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.