- టెస్లా సైబర్‌ట్రక్ తయారీని వచ్చే ఏడాది వేసవి చివరి వరకు కొనసాగింపు
- పెండింగ్ ఆర్డర్లను పూర్తి చేసేందుకేనని వెల్లడించిన మస్క్
- గతంలో ఉత్పత్తిని తగ్గించి సైబర్‌క్యాబ్ తయారీకి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయం
- సైబర్‌ట్రక్ అమ్మకాలు అంచనాలకు తగ్గట్లు లేకపోవడంతో సబర్క్యాబ్పై దృష్టి
టెస్లా సైబర్‌ట్రక్ ఉత్పత్తికి మరికొంత సమయం దక్కింది. వచ్చే ఏడాది మధ్యలోనే ఈ పికప్ ట్రక్ తయారీని నిలిపివేయనున్నట్లు గతంలో ప్రకటించిన ఎలాన్ మస్క్.. తాజాగా ఆ గడువును వేసవి చివరి వరకు పొడిగించారు. పెండింగ్‌లో ఉన్న ఆర్డర్లను పూర్తి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో టెక్సాస్‌లోని గిగాఫ్యాక్టరీలో సైబర్‌ట్రక్ తయారీ మరో రెండు, మూడు నెలలు కొనసాగనుంది.
సైబర్‌ట్రక్ ఉత్పత్తిని తగ్గించి, ఆ సామర్థ్యాన్ని రోబోట్యాక్సీ అయిన సైబర్‌క్యాబ్ తయారీకి వినియోగించాలని టెస్లా గతంలో నిర్ణయించింది. అయితే సైబర్‌ట్రక్ కోసం ఎదురుచూస్తున్న వినియోగదారుల ఆర్డర్లు ఇంకా పెండింగ్‌లో ఉండటంతో ఉత్పత్తిని కొంతకాలం కొనసాగించాలని మస్క్ భావించారు. గతంలో నిర్ణయించిన గడువులోగా వాహనాలను తయారు చేయలేకపోతే కొందరు కొనుగోలుదారులకు డిపాజిట్లు తిరిగి ఇవ్వాల్సి రావచ్చని కూడా ఆయన సూచించారు. ఉత్పత్తి పొడిగింపు లాభాల పరంగా తెలివైన నిర్ణయం కాకపోవచ్చని మస్క్ ఎక్స్‌లో పేర్కొన్నారు.
సైబర్‌ట్రక్ ఏడాదికి 2.5 లక్షల యూనిట్ల ఉత్పత్తి సాధిస్తుందని గతంలో మస్క్ అంచనా వేశారు. అయితే 2023 చివర్లో డెలివరీలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం అమ్మకాలు సుమారు 70 వేల యూనిట్లేనని పరిశ్రమ అంచనాలు చెబుతున్నాయి.
సైబర్‌ట్రక్ యజమానులు, అభిమానుల నుంచి వచ్చిన వ్యతిరేకత కూడా తాజా నిర్ణయంపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఈ మోడల్ ఉత్పత్తిని కొనసాగించాలని కోరుతూ 5 వేల మందికి పైగా ఆన్‌లైన్ పిటిషన్‌పై సంతకాలు చేశారు. టెస్లా వాహనాలకు విడిభాగాలు, ఉపకరణాలు తయారు చేసే అన్‌ప్లగ్డ్ పెర్ఫార్మెన్స్ సంస్థ కూడా పెట్టుబడిదారుల సాయంతో సైబర్‌ట్రక్ ఉత్పత్తిని చేపట్టే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపింది.