- సోనియా గాంధీ ఆత్మకథ ఆవిష్కరణలో రాహుల్ భావోద్వేగ ప్రసంగం
- తల్లిదండ్రులు కలిసిన కేంబ్రిడ్జ్ రెస్టారెంట్‌కు సంబంధించిన సరదా జ్ఞాపకాలను పంచుకున్న రాహుల్
- రాజీవ్ హత్య తర్వాత అమ్మ జీవితం పూర్తిగా మారిపోయిందన్న రాహుల్
- అమ్మ భయపడటం ఎప్పుడూ చూడలేదన్న కాంగ్రెస్ నేత
- నాన్న ఉంటే అమ్మను చూసి ఎంతగానో గర్వపడేవారని వ్యాఖ్య
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన తల్లి సోనియా గాంధీ జీవిత చరిత్ర "బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్" ఆవిష్కరణ సభలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా తన తల్లిదండ్రులైన రాజీవ్ గాంధీ, సోనియా గాంధీకి సంబంధించిన పలు వ్యక్తిగత, మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. వారి ప్రేమకథలోని సరదా సంఘటనల నుంచి, రాజీవ్ హత్య తర్వాత సోనియా జీవితంలో వచ్చిన పెను మార్పుల వరకు అనేక విషయాలను సభతో పంచుకుని అందరినీ కదిలించారు.
తన తల్లిదండ్రులు తొలిసారి కలుసుకున్న కేంబ్రిడ్జ్‌లోని వర్సిటీ రెస్టారెంట్‌కు సంబంధించిన ఓ సరదా సంఘటనను రాహుల్ గుర్తుచేసుకున్నారు. "చాలా ఏళ్ల తర్వాత నేను కేంబ్రిడ్జ్‌లో ఉన్నప్పుడు, నా గర్ల్‌ఫ్రెండ్‌ను ఆ రెస్టారెంట్‌కు తీసుకెళ్లాను. అక్కడకు ఎందుకు వెళ్తున్నామో ఆమెకు ముందు చెప్పలేదు. లోపలికి వెళ్లి, మా అమ్మానాన్న ఇక్కడే కలిశారని అక్కడి సిబ్బందితో చెప్పాను. దానికి అతను, 'ఓ వాళ్లా.. నాకు బాగా తెలుసు' అని సమాధానమిచ్చాడు. అతను చికెన్ చస్సార్ బాగుంటుందని చెబితే ఆర్డర్ చేశాం. కానీ ఆ ఫుడ్ చాలా దారుణంగా ఉంది. మీరు ప్రేమలో పడాలనుకుంటే వర్సిటీ రెస్టారెంట్‌కు వెళ్లండి, కానీ ఆ చికెన్ మాత్రం ఎప్పుడూ తినొద్దు" అని రాహుల్ నవ్వుతూ చెప్పడంతో సభలో నవ్వులు పూశాయి.
తన తల్లిదండ్రుల మధ్య ఉన్న గాఢమైన అనురాగం గురించి వివరిస్తూ.. "ప్రతి భోజనం సమయంలో మా నాన్న ఒడిలో అమ్మ కూర్చునేది. ఇతర ఇళ్లలో నేను ఇలాంటి దృశ్యం చూడలేదు. వారిద్దరూ గొడవపడటం నేను నా జీవితంలో ఒక్కసారే చూశాను. పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో నాన్న ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఈ ఘటన జరిగింది" అని రాహుల్ తెలిపారు.
రాజీవ్ గాంధీ హత్య తర్వాత సోనియా గాంధీ జీవితం పూర్తిగా మారిపోయిందని రాహుల్ భావోద్వేగంతో అన్నారు. "ఇందిరా గాంధీ, ఆ తర్వాత రాజీవ్ గాంధీ హత్యలతో మా కుటుంబానికి రెండు పెద్ద ఆధారాలు లేకుండా పోయాయి. సరదాగా, నవ్వుతూ ఉండే అమ్మ మాయమైంది. ఆమె జీవితంలో వెలుగు ఆరిపోయింది. ఒకప్పుడు అందరితో కలిసిపోయే ఆమె, ఒంటరిగా మారిపోయారు" అని వివరించారు. ఆ సమయంలో దేశ ప్రజలు, ముఖ్యంగా గ్రామాల్లోని వారు ఆమెకు అండగా నిలిచి, 'మీరు మాకు చెందినవారు' అనే భరోసా ఇచ్చారని గుర్తుచేసుకున్నారు.
సోనియా గాంధీ క్యాన్సర్‌తో పోరాడిన తీరును, ఆమె ధైర్యాన్ని రాహుల్ ప్రశంసించారు. "నా జీవితంలో ఆమె భయపడటం నేను ఒక్కసారి కూడా చూడలేదు. ఎలాంటి క్లిష్ట పరిస్థితిలోనూ వెనకడుగు వేయలేదు" అని అన్నారు. తన ప్రసంగాన్ని ముగిస్తూ.. "అమ్మా.. నాన్న నిన్ను ఎంతగానో ప్రేమించారు. ఇప్పుడు నిన్ను చూసి ఆయన ఎంత గర్వపడతారో నేను మాటల్లో చెప్పలేను" అంటూ రాహుల్ భావోద్వేగంగా ప్రసంగాన్ని ముగించారు.