- బంగాళాఖాతంలో 'అక్వాన్' తుపాను
- శుక్రవారం మధ్యాహ్నం నెల్లూరు - తుని మధ్య తీరం దాటే అవకాశం
- తీరం దాటే సమయంలో 145 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు
- గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్రలో అత్యంత భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి తుపానుగా మారింది. ఈ తుపానుకు 'అక్వాన్'గా నామకరణం చేశారు. ప్రస్తుతం ఇది గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ప్రస్తుత సమాచారం ప్రకారం.. ఈ తుపాను చెన్నైకి 610 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 660 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 670 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 790 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
వాతావరణ శాఖ వివరాల ప్రకారం, ఇది పశ్చిమ-వాయవ్య దిశగా ప్రయాణిస్తూ రేపు సాయంత్రానికి తీవ్ర తుపానుగా మారనుంది. అనంతరం మరింత బలపడి గురువారం ఉదయానికి అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందే అవకాశముంది. ఈ తుపాను క్రమంగా పయనిస్తూ శుక్రవారం మధ్యాహ్నానికి ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు - తుని మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
తుపాను తీరం దాటే సమయంలో తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఆ సమయంలో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 145 కిలోమీటర్ల వేగంతో విధ్వంసకర గాలులు వీచే అవకాశం ఉంది. సముద్రం అల్లకల్లోలంగా మారనున్నందున మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. దీని ప్రభావంతో ఎల్లుండి నుంచి కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు మొదలై, గురు, శుక్రవారాల్లో చాలా ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలు, రైతులు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, తీరప్రాంత ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.
తుపాను సంబంధిత సమస్యల పరిష్కారం, తాజా సమాచారం కోసం ప్రభుత్వం 'మన మిత్ర' వాట్సాప్ నంబర్ 9552300009 అందుబాటులో ఉంచింది. అత్యవసర సహాయం అవసరమైన వారు 112, 1070 లేదా టోల్ ఫ్రీ నంబర్ 18004250101 కు ఫోన్ చేసి అధికారులను సంప్రదించవచ్చని స్పష్టం చేశారు. విపత్తు నిర్వహణ బృందాలు క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి.