- రామోజీరావు జయంతిని అధికారిక రాష్ట్ర పండుగగా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ సభలో పాల్గొన్న అమిత్ షా, గవర్నర్ అబ్దుల్ నజీర్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్
- తొమ్మిది రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు అవార్డుల ప్రదానం
- రాజధాని అమరావతి పేరును శాస్త్రీయంగా సూచించింది రామోజీరావేనన్న సీఎం
- విలువల కోసం చివరివరకు రాజీలేని పోరాటం చేసిన యోధుడు రామోజీరావు అని కితాబు
తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు, పద్మవిభూషణ్ స్వర్గీయ రామోజీరావు జయంతిని ఇకపై ప్రతి ఏటా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ‘రాష్ట్ర పండుగ’గా నిర్వహిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆయన తెలుగు జాతికి, రాష్ట్రానికి అందించిన నిరుపమాన సేవలను చిరస్మరణీయం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రామోజీరావు 90వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రతిష్ఠాత్మక ‘రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2026’ ప్రదానోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు ఈ మేరకు ప్రకటన చేశారు. విజయవాడలోని బీఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకాగా.. ఏపీ గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, కె. రామ్మోహన్ నాయుడు, రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జర్నలిజం, కళలు-సంస్కృతి, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, మహిళా సాధికారత, సైన్స్ అండ్ టెక్నాలజీ, సామాజిక సేవ, యూత్ ఐకాన్, విద్య-వైద్యం రంగాల్లో విశేష సేవలు అందించిన 9 మంది ప్రముఖులకు రామోజీ ఎక్సలెన్స్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలకు, రామోజీ గ్రూప్ సీఎండీ కిరణ్‌కు, వారి కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రామోజీరావుతో తనకు 1980 నుంచి దాదాపు 45 ఏళ్లకు పైగా ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. "నేను తొలిసారి ముఖ్యమంత్రి అయిన సమయంలో రామోజీరావు గారు నాతో ఒక స్పష్టమైన మాట చెప్పారు. 'నేను ప్రభుత్వంలో మీ నుంచి నా కోసం గానీ, నా మనుషుల కోసం గానీ ఏ పనీ అడగను. అలాగే మీరూ కూడా మా సంస్థ విషయంలో ఇది రాయాలనో, రాయకూడదనో, ఎవరినైనా బదిలీ చేయాలనో అడగొద్దు. మీరు ప్రజలకు మంచి చేస్తే 24 గంటలూ మీకు మద్దతుగా నిలుస్తా.. అదే తప్పు చేస్తే మాత్రం చాకిరేవు తప్పదు' అని నిర్మొహమాటంగా చెప్పారు. విలువలకు కట్టుబడి పనిచేయడం ఆయనకే సాధ్యమైంది" అని చంద్రబాబు పేర్కొన్నారు.
ఈనాడు వార్తాపత్రిక విశ్వసనీయత గురించి ప్రస్తావిస్తూ.. రాత్రి 9 గంటలకు టీవీలలో ఎన్ని వార్తలు చూసినా, ఉదయం ఈనాడు పత్రిక చూసి వార్తను నిర్ధారించుకునే స్థాయి క్రెడిబిలిటీని రామోజీరావు సాధించారని సీఎం కొనియాడారు. "ఆధారాలు (డాక్యుమెంటరీ ఎవిడెన్స్) ఉంటే తనపై వార్త వచ్చినా కూడా ప్రచురించాలని జర్నలిస్టులకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన మహోన్నత వ్యక్తి ఆయన. సాధారణ వ్యక్తులను ఎంచుకుని అసాధారణ ప్రతిభావంతులుగా తీర్చిదిద్దిన శిల్పి రామోజీరావు" అని ప్రశంసించారు.
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా 'అమరావతి' పేరు వెనుక రామోజీరావు చేసిన పరిశోధన ఎంతో ఉందని చంద్రబాబు గుర్తుచేశారు. శాస్త్రీయంగా, చారిత్రకంగా ఎందుకు అమరావతి పేరు పెట్టాలో పూర్తి అధ్యయనం చేసి తనకు సూచించారని, ఆ పేరును యావత్ ప్రజానీకం నూటికి నూరు శాతం ఆమోదించిందని తెలిపారు. అమరావతి నిర్మాణానికి రామోజీ గ్రూప్ తరఫున రూ.10 కోట్ల విరాళం అందించారని, కరోనా సమయంలోనూ రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.10 కోట్లు ఇచ్చారని గుర్తుచేశారు. లాతూర్ భూకంపం, సునామీ, హుద్‌హుద్ వంటి ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులకు అండగా నిలవడమే కాకుండా, ప్రజల నుంచి సేకరించిన ప్రతి పైసాకు పూర్తిస్థాయిలో లెక్కలు చూపించిన నైతికత రామోజీ గ్రూప్దని కొనియాడారు.
జీవిత చరమాంకంలో 86 ఏళ్ల వయసులో అనారోగ్యంతో మంచానికే పరిమితమైన సమయంలోనూ రాజకీయ కుట్రలతో రామోజీరావును ఇబ్బందులకు గురిచేశారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. మంచంపై ఉన్న వీడియోలను బయటకు విడుదల చేసి మానసికంగా దెబ్బతీయాలని చూసినా ఆయన ఏనాడూ తలవంచలేదని, సిద్ధాంతం కోసం రాజీలేని పోరాటం చేశారని అన్నారు. రామోజీరావు తెలుగు జాతికి దక్కిన ఒక గొప్ప ఆస్తి అని, ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. రామోజీరావు తమ కుటుంబానికి ఇచ్చింది కేవలం ఆస్తులు మాత్రమే కాదని, సమాజ హితం కోసం నిలబడే ఒక గొప్ప బాధ్యతను ఇచ్చారని, ఆ విలువలను ఎప్పటికీ ముందుకు తీసుకెళ్లాలని రామోజీ కుటుంబ సభ్యులకు చంద్రబాబు ఆకాంక్షించారు.