- అనంతపురం జిల్లాలో సర్పంచ్ పదవికి వేలం పాట
- రూ. 29 లక్షలకు అమ్ముడైన సర్పంచ్ పోస్ట్
- రామాలయ నిర్మాణం కోసమే ఈ నిర్ణయం
- పదవిని దక్కించుకున్న టీడీపీ నేత బి. నారాయణ
- ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్న గ్రామస్థులు
అనంతపురం జిల్లాలో ఒక ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామంలో రామాలయ నిర్మాణం కోసం సర్పంచ్ పదవినే వేలం వేసి, తద్వారా వచ్చిన నిధులను గుడి కోసం వినియోగించాలని గ్రామస్థులు నిర్ణయించారు.
వివరాల్లోకి వెళితే.. గార్లదిన్నె మండలం, కప్పల బండ గ్రామ పంచాయతీలో ఈ సంఘటన జరిగింది. గ్రామంలో ఇప్పటివరకు గుడి లేదు. సుమారు రూ. 20 లక్షల ఖర్చుతో శ్రీరాముడి ఆలయం నిర్మించాలని గ్రామ పెద్దలు ఎప్పటినుంచో భావిస్తున్నా, వరుస కరువులు, ఇతర కారణాల వల్ల అది సాధ్యపడలేదు. ఈ నేపథ్యంలో రాబోయే పంచాయతీ ఎన్నికలను గ్రామస్థులు ఒక అవకాశంగా మలుచుకున్నారు.
సర్పంచ్ పదవి కోసం నిర్వహించిన ఈ వేలం పాట రూ. 20 లక్షలతో ప్రారంభం కాగా, టీడీపీకి చెందిన నేత బి. నారాయణ అత్యధికంగా రూ. 29 లక్షలు పలికి పదవిని దక్కించుకున్నారు. ఎన్నికల వల్ల వచ్చే గొడవలు, ఉద్రిక్తతలను నివారించేందుకు, అలాగే ప్రభుత్వాన్ని నుంచి ఏకగ్రీవ ప్రోత్సాహకాలను అందుకునేందుకు గ్రామస్థులంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో బి. నారాయణను ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎన్నుకోవడానికి అంగీకరించారు.
ఈ వేలం పాట గురువారం జరగ్గా, దీనికి సంబంధించిన వీడియోలు శనివారం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో విషయం బయటకు వచ్చింది.