అండర్-19 ఆసియా కప్ 2026 ఫైనల్‌లో  అద్భుత విజయం సాధించిన భారత యువ జట్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ సామాజిక మాధ్యమాల వేదికగా అభినందించారు. 
  
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ జట్టుపై భారత యువ జట్టు సాధించిన విజయంపై  చంద్రబాబు స్పందిస్తూ.. తీవ్రమైన ఒత్తిడిలోనూ యువ క్రికెటర్లు కనబరిచిన తెగువ, క్రీడాస్ఫూర్తి అమోఘమని కొనియాడారు. భారత క్రికెట్ చరిత్రలో ఇదొక మైలురాయిగా నిలిచిపోతుందని అభివర్ణించారు. ఈ విజయంలో భాగస్వామి అయిన ఆంధ్రప్రదేశ్ ఆటగాడు చిగురుపాటి వెంకటను మంత్రి నారా లోకేశ్ ప్రత్యేకంగా అభినందించారు. లోయర్ ఆర్డర్‌లో 87 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి, జట్టు గెలుపులో వెంకట కీలక పాత్ర పోషించాడని ప్రశంసించారు.