- విశాఖలో రూ. 1,755 పెట్టి కొన్న కుక్కర్లో ఉడకని అన్నం పప్పు
- వస్తువు మార్చడానికి నిరాకరించి మహిళపైనే ఆరోపణలు చేసిన డీలర్
- బాధిత మహిళకు రూ. 16,755 చెల్లించాలని కమిషన్ సంచలన ఆదేశం
- కోర్టు పరువు తీసేలా మాట్లాడినందుకు రూ. 21 వేల అదనపు జరిమానా
- వినియోగదారుల హక్కులను కాపాడిన విశాఖ జిల్లా ఫోరం తీర్పు
సాధారణంగా వంటింట్లో ప్రెజర్ కుక్కర్ మూడు నాలుగు విజిల్స్ వేసిందంటే చాలు.. ఘుమఘుమలాడే అన్నమో, పప్పు కూరో సిద్ధమైపోవాలి. కానీ విశాఖపట్నానికి చెందిన ఓ మహిళ కొనుగోలు చేసిన కొత్త కుక్కర్ మాత్రం ఎన్ని విజిల్స్ వేసినా అన్నం ఉడకలేదు, పప్పు మెత్తబడలేదు. ఇదేంటని నిలదీస్తే దుకాణదారుల నుంచి నిర్లక్ష్యపు సమాధానాలు ఎదురయ్యాయి. చివరకు ఆ మహిళ వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించగా.. ఆ వ్యాపారులకు దిమ్మతిరిగే తీర్పు వెలువడింది. కేవలం రూ. 1,755 విలువైన కుక్కర్ వ్యవహారంలో నిర్లక్ష్యం ప్రదర్శించినందుకు దుకాణదారు, డీలర్‌కు కమిషన్ భారీ మూల్యం చెల్లించేలా చేసింది.
విశాఖపట్నానికి చెందిన ఓ మహిళ స్థానిక దుకాణంలో యూపీఐ ద్వారా రూ. 1,755 చెల్లించి నాలుగు లీటర్ల సరికొత్త ప్రెజర్ కుక్కర్‌ను కొనుగోలు చేశారు. ఇంటికి తెచ్చిన రోజే అందులో అన్నం వండేందుకు ప్రయత్నించగా, సాధారణంగా వచ్చే 3 నుంచి 4 విజిల్స్ వచ్చినా బియ్యం సగం మాత్రమే ఉడికాయి. మరుసటి రోజు పప్పు వండినా అదే పరిస్థితి పునరావృతమైంది. కొత్త కుక్కర్ సరిగా పనిచేయకపోవడంతో ఆమె వెంటనే సదరు దుకాణాన్ని సంప్రదించారు. అయితే, అక్కడి సిబ్బంది బాధ్యతారాహిత్యంగా సమాధానమిస్తూ.. కంపెనీ సర్వీస్ సెంటర్‌కు వెళ్లాలని సూచించారు. తన వయస్సు, శారీరక ఇబ్బందుల దృష్ట్యా సర్వీస్ సెంటర్‌కు వెళ్లలేనని చెప్పడంతో, చివరికి దుకాణ సిబ్బందే కుక్కర్‌ను తీసుకెళ్లి రిపేర్ బిల్లు చేతిలో పెట్టారు. కొత్త వస్తువు లోపభూయిష్టంగా ఉన్నప్పుడు తనకు రిపేర్ కాకుండా కొత్త కుక్కర్‌ను రీప్లేస్ చేయాలని ఆమె పట్టుబట్టారు.
ఈ వివాదంపై తయారీ సంస్థ స్పందిస్తూ.. కుక్కర్‌ను రీప్లేస్ చేయాలని తాము డీలర్‌కు సూచించినట్లు తెలిపింది. కానీ డీలర్ మాత్రం అందుకు నిరాకరించారు. పైగా సర్వీస్ సిబ్బంది కుక్కర్‌ను పరిశీలించారని, అది సక్రమంగా పనిచేస్తున్న వీడియోను చూపించినా ఆ మహిళ డెమో చూసేందుకు అంగీకరించలేదని దుకాణదారు, డీలర్ వాదించారు. కుక్కర్లో లోపం ఉందని నిరూపించేందుకు ఎలాంటి టెక్నికల్ రిపోర్టు ఇవ్వలేదని, తనకు వినియోగదారుల కమిషన్‌లో పలుకుబడి ఉందని బెదిరింపులకు దిగారంటూ ఆమెపైనే ఎదురుదాడికి దిగారు. మరోవైపు, వస్తువులో తయారీ లోపాలుంటేనే వారంటీ వర్తిస్తుందని, పరీక్షల్లో కుక్కర్ బాగానే పనిచేసిందని తయారీ సంస్థ కోర్టులో వాదించింది.
ఈ కేసును విచారించిన విశాఖపట్నం జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ బెంచ్ (గుడ్ల తనుజ నేతృత్వంలో) వ్యాపారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కుక్కర్లో ఎలాంటి లోపం లేకపోతే ‘సద్భావన’ (గుడ్‌విల్) కింద దాన్ని ఎందుకు మార్చి ఇస్తామన్నారని కమిషన్ ప్రశ్నించింది. సరైన వారంటీ నిబంధనలను సైతం కోర్టు ముందు ప్రవేశపెట్టడంలో వ్యాపారులు విఫలమయ్యారని గుర్తుచేసింది. వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం ఆమెకు పూర్తి రీఫండ్ పొందే హక్కు ఉందని, అది వ్యాపారులు చూపించే ఔదార్యం కాదని స్పష్టం చేసింది. అంతేకాకుండా, కమిషన్‌లో పలుకుబడి ఉందంటూ మహిళపై నిరాధార ఆరోపణలు చేయడం ఆమె పరువు తీయడమే కాకుండా, కమిషన్ ప్రతిష్టను దిగజార్చేలా ఉందని తీవ్రంగా తప్పుబట్టింది.
ఈ మేరకు అక్టోబర్ 31న తుది తీర్పు వెలువరించిన కమిషన్.. సదరు మహిళకు కుక్కర్ అసలు ఖరీదు రూ. 1,755ను పూర్తిగా వాపసు ఇవ్వాలని ఆదేశించింది. సేవా లోపానికి పరిహారంగా రూ. 12,000, న్యాయపోరాట ఖర్చుల నిమిత్తం రూ. 3,000.. మొత్తంగా రూ. 16,755ను బాధిత మహిళకు చెల్లించాలని ఆదేశించింది. దీనితో పాటు, మహిళపై నిరాధార ఆరోపణలు చేసినందుకు గాను దుకాణదారు, డీలర్ అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థకు రూ. 21,000 జరిమానాగా చెల్లించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.