- మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీని సందర్శించిన రామ్ చరణ్
- షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ అధికారిక ప్రకటన
- దర్శనం అనంతరం రామ్‌చరణ్‌ను సంప్రదాయబద్ధంగా సత్కరించిన సంస్థాన్ ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి గోరక్ష గాడిల్కర్
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు రామ్‌చరణ్ మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీని సందర్శించాడు. శుక్రవారం సాయిబాబా మందిరానికి వెళ్లి ప్రత్యేక దర్శనం చేసుకున్నాడు. మధ్యాహ్న హారతి కార్యక్రమంలో పాల్గొని బాబా సన్నిధిలో ప్రార్థనలు చేశాడు. ఈ విషయాన్ని షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ అధికారికంగా వెల్లడించింది.
దర్శనం అనంతరం సంస్థాన్ ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి గోరక్ష గాడిల్కర్ రామ్‌చరణ్‌ను సంప్రదాయబద్ధంగా సత్కరించాడు. ఆలయానికి వచ్చే ప్రముఖులను దర్శనం తర్వాత సంస్థాన్ ప్రతినిధులు గౌరవించడం ఆనవాయతీగా వస్తోంది. రామ్‌చరణ్ పర్యటన వివరాలను ట్రస్ట్ తన అధికారిక వెబ్‌సైట్‌లోనూ ప్రచురించింది.
రామ్‌చరణ్ షిర్డీ పర్యటనకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది. సినిమా కార్యక్రమాలకు భిన్నంగా ఆయన ఆధ్యాత్మిక పర్యటన చేపట్టడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. సాయిబాబా దర్శనానికి వెళ్లినట్లు పలువురు ‘ఎక్స్’ వేదికగా పోస్టులు పెట్టారు.
అయితే ఈ పర్యటన వెనుక వ్యక్తిగత కారణాలు, ప్రత్యేక మొక్కులు ఉన్నాయా? అనే విషయంపై రామ్‌చరణ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
.