- 1980లో వంతెన నిర్మాణం కోసం భూమి సేకరించిన ప్రభుత్వం
- పరిహారం చెల్లించకపోవడంతో కేరళంలోని పతనంతిట్ట కోర్టు కీలక నిర్ణయం
- ఇద్దరు అదనపు జిల్లా కలెక్టర్ల కార్లను జప్తు చేసేలా ఆదేశాలు
- మురళీధరన్‌కు వడ్డీతో కలిపి రూ.12.60 లక్షలు చెల్లించాలి
- బకాయి చెల్లించకపోతే కార్లను వేలం వేస్తామని స్పష్టీకరణ
వంతెన నిర్మాణం కోసం 1980లో సేకరించిన భూమికి పరిహారం చెల్లించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడంతో కేరళంలో కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పరిహారం చెల్లించాలని పలుమార్లు ఆదేశించినా స్పందన లేకపోవడంతో పతనంతిట్ట, శబరిమల అదనపు జిల్లా కలెక్టర్ల అధికారిక వాహనాలను గురువారం జప్తు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు అధికారులు ఈ చర్యలు చేపట్టారు.
ఎనాత్‌కు చెందిన మురళీధరన్ భూమిని 1980లో అక్కడ వంతెన నిర్మాణం కోసం ప్రభుత్వం సేకరించింది. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయనకు పరిహారం అందలేదు. దీంతో 1995లో పతనంతిట్ట సబ్‌కోర్టును ఆశ్రయించారు. 2008లో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆ ఉత్తర్వులను అమలు చేయాలని కోరుతూ 2009లో మరోసారి కోర్టును ఆశ్రయించారు.
ఈ వ్యవహారంలో కొల్లాం రోడ్స్ డివిజన్ ప్రజాపనుల శాఖకు (పీడబ్ల్యూడీ) పలుమార్లు నోటీసులు జారీ చేసినా పరిహారం చెల్లింపులో జాప్యం కొనసాగింది. నిధుల కొరత కారణంగా మొత్తం చెల్లించలేకపోతున్నట్లు ఆ శాఖ అధికారులు తెలిపినట్లు సమాచారం. వడ్డీతో కలిపి మురళీధరన్‌కు చెల్లించాల్సిన మొత్తం రూ.12,60,361గా అధికారులు వెల్లడించారు.
ఈ మొత్తాన్ని వసూలు చేసేందుకు కోర్టు అమలు చర్యల్లో భాగంగా ఇద్దరు అడిషనల్ కలెక్టర్ల వాహనాలను జప్తు చేసింది. కార్లకు నోటీసులు అంటించిన అనంతరం వాటిని కోర్టు ప్రాంగణానికి తరలించారు. జప్తు చేసినవి 2016, 2014 మోడళ్ల టయోటా ఇన్నోవా కార్లు. బకాయి మొత్తాన్ని చెల్లించకపోతే ఈ వాహనాలను వేలం వేసి పరిహారం రాబట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
జిల్లా కలెక్టర్ నిజాముద్దీన్ మీడియాతో మాట్లాడుతూ.. అదనపు జిల్లా కలెక్టర్ల కోసం ప్రత్యామ్నాయ వాహనాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కోర్టు ఆదేశించిన మొత్తాన్ని జమ చేసిన తర్వాత జప్తు చేసిన కార్లను విడిపించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి జప్తుల కారణంగా శాఖల సాధారణ కార్యకలాపాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు.