Advertisement

స్వీట్‌ కనిపిస్తే ఆగలేకపోతున్నారా? అతిగా తినకుండా ఉండేందుకు 3 సింపుల్‌ చిట్కాలు!

Health
Advertisement
  • స్వీట్లను అతిగా తినకుండా ఉండేందుకు న్యూట్రిషనిస్ట్‌ నమామి 3 చిట్కాలు
  • ఒకసారి ఒక్క స్వీట్‌ మాత్రమే తీసుకోవాలని సూచన
  • నట్స్‌, సీడ్స్‌తో కలిపి తింటే కడుపు నిండిన ఫీల్‌
  • తగినంత నీరు తాగితే దాహాన్ని ఆకలిగా పొరబడే అవకాశం ఉండదని వెల్లడి
  • స్వీట్లను పూర్తిగా మానేయకుండా తినే పరిమాణంపై అవగాహన పెంచుకోవాలని సూచన
స్వీట్లు కనిపిస్తే ఒక్కటి తినాలనుకుంటాం.. అది తిన్నాక మరొకటి.. ఇంకొకటి అంటూ చేయి మళ్లీ మళ్లీ వాటి వైపే వెళ్తుంటుంది. ఇలాంటి అలవాటును కేవలం మనసును నియంత్రించుకోవడం ద్వారా మాత్రమే ఆపలేమంటున్నారు న్యూట్రిషనిస్ట్‌ నమామి అగర్వాల్‌. స్వీట్లలోని చక్కెర, కొవ్వు పదార్థాల కలయిక మెదడులోని రివార్డ్‌ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. దీంతో మరొకటి తినాలనే కోరిక కలుగుతుంది. అయితే స్వీట్లను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేకుండానే కొన్ని చిన్న మార్పులతో తినే అలవాటును మెరుగుపరచుకోవచ్చని ఆమె సూచిస్తున్నారు.

1. ఒక్కసారి ఒక్క స్వీటే తీసుకోండి
స్వీట్ల డబ్బాను పక్కన పెట్టుకొని ఇష్టమొచ్చినప్పుడల్లా ఒక్కోటి తీసుకొని తినడం మంచిది కాదు. ఒకేసారి ఒక స్వీట్‌ను మాత్రమే ప్లేట్‌లో పెట్టుకోవాలి. దాన్ని ఆస్వాదిస్తూ నెమ్మదిగా తినాలి. ఇలా చేయడం వల్ల తెలియకుండానే ఎక్కువ స్వీట్లు తినే అలవాటును తగ్గించుకోవచ్చు

2. స్వీట్లతో పాటు నట్స్‌, సీడ్స్‌ తీసుకోండి
స్వీట్లను మాత్రమే తినకుండా వాటితో పాటు నట్స్‌ లేదా సీడ్స్‌ తీసుకోవాలని నమామి సూచిస్తున్నారు. బాదం, ఇతర గింజలు, విత్తనాల్లో ప్రొటీన్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్‌ ఉంటాయి. ఇవి కడుపు నిండిన భావన కలిగించడంలో తోడ్పడతాయి. దీంతో వెంటనే మరో స్వీట్‌ తినాలనే కోరిక తగ్గవచ్చు. అయితే దీనివల్ల స్వీట్‌ ఆరోగ్యకరమైన ఆహారంగా మారిపోతుందని కాదు.

3. నీళ్లు తాగడం మర్చిపోవద్దు
దాహాన్ని కొన్నిసార్లు ఆకలిగా పొరబడే అవకాశం ఉందని న్యూట్రిషనిస్ట్‌ చెబుతున్నారు. శరీరానికి సరిపడా నీరు అందకపోతే ఏదైనా తినాలనే కోరిక కలగవచ్చు. నిజానికి ఆ సమయంలో శరీరానికి కావాల్సింది ఆహారం కాకుండా నీరు కావచ్చు. అందుకే స్వీట్‌ లేదా ఇతర చిరుతిండి తీసుకునే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా స్నాక్స్‌ తినడానికి ముందు శరీరానికి తగినంత నీరు అందిందో? లేదో? చూసుకోవాలి.
Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

More Telugu News

విశాఖలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ.. పెట్టుబడులపై కీలక చర్చ

12 Nov, 10:57

విశాఖలో సీఐఐ సమ్మిట్ ఘనంగా ప్రారంభం.. రూ. 12 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం

12 Nov, 10:56

సెహ్వాగ్ త‌న‌యుడికి కోహ్లీ చిన్న‌ప్పుడు ఇచ్చిన స‌ల‌హా ఇదే.. వైరల్ అవుతున్న ఆర్యవీర్ పాత ఇంటర్వ్యూ వీడియో!

12 Nov, 10:55

ఏనుగు కాళ్ల కింద రెండుసార్లు నలిగినా.. బతికి బయటపడ్డ బైకర్‌!

12 Nov, 10:42

సోనియాగాంధీ ఆత్మకథపై పీవీ కుమార్తె వాణీదేవి తీవ్ర విమర్శలు

12 Nov, 10:30

రూ.70 లక్షల జీతం.. అయినా ఉద్యోగం ఊస్ట్.. క్వాల్‌కామ్‌లో కలకలం

12 Nov, 10:28

యూకే, ఐర్లాండ్‌లో ‘రామాయణ’ చరిత్ర.. హాలీవుడ్‌, జపాన్‌ సినిమాలను వెనక్కి నెట్టి అగ్రస్థానం

12 Nov, 10:25

నాని సినిమా టీంపై బాబు మోహన్ ఫైర్.. కర్మ ఫలం అంటూ సంచలన వ్యాఖ్యలు!

12 Nov, 10:24

వెయ్యి కోట్ల విలువైన బీసీ స్టడీ సర్కిల్ భూములను ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టారు: దాసోజు శ్రవణ్

12 Nov, 10:21

ఓవర్‌టేక్ చేశాడని యువకుడి వేళ్లు నరికిన మైనర్లు.. 700 కుట్లు వేసిన వైద్యులు

12 Nov, 10:14

రూ.100తో మొదలైన ప్రయోగం.. నేడు రూ.కోటి వ్యాపారం.. ఒడిశా రైతు సక్సెస్‌ స్టోరీ

12 Nov, 10:12

నేటి నుంచి రెండు రోజుల పాటు జరుగనున్న పెట్టుబడుల పండుగకు సిద్ధమైన విశాఖ

12 Nov, 10:09

పంజాబ్‌లో ఆగని పొలాల దహనం.. 5,500 దాటిన పంట వ్యర్థాల కాల్చివేత ఘటనలు

12 Nov, 10:08

సోనియా గాంధీ జీవితంపై సినిమా.. నిర్మాతలుగా కాంగ్రెస్ కార్యకర్తలు: జగ్గారెడ్డి సంచలన ప్రకటన

12 Nov, 10:06
..More Telugu News