- గతంలో కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న కొండా సురేఖ
- వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటే సరిపోదన్న ప్రవీణ్ కుమార్
- టామ్‌కామ్ సంస్థను మంత్రి వివేక్ దుర్వినియోగం చేస్తున్నారని విమర్శ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై గతంలో చేసిన వ్యక్తిగత వ్యాఖ్యల విషయంలో మాజీ మంత్రి కొండా సురేఖ షరతులు లేకుండా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. సురేఖ తన వ్యాఖ్యలను కేవలం వెనక్కి తీసుకుంటే సరిపోదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్‌పై తన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకమైనవి కావని, వాటిని వెనక్కి తీసుకుంటున్నానని కొండా సురేఖ తాజాగా చేసిన ప్రకటనపై ప్రవీణ్ కుమార్ స్పందించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అలాంటి వ్యాఖ్యలు చేయడం నేరమని, ఆమె మాటలు తెలంగాణ మహిళల, రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీశాయని ఆరోపించారు. కేటీఆర్ పెద్ద మనసుతో కోర్టుకు వెళ్లారని, వాస్తవానికి ఆమెపై క్రిమినల్ కేసు పెట్టాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో హరీశ్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌లకు కూడా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు.
ఇదే సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామిపై ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. నిరుద్యోగ యువతకు విదేశాల్లో ఉపాధి కల్పించేందుకు ఏర్పాటు చేసిన టామ్‌కామ్ (తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ) సంస్థను మంత్రి వివేక్ దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. జర్మనీలో ఉద్యోగాల పేరుతో ప్రకటనలు ఇచ్చి, ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 4.10 లక్షలు వసూలు చేశారని ఆరోపించారు.
ఉచితంగా ఇవ్వాల్సిన అవకాశాలకు డబ్బులు వసూలు చేయడమే కాకుండా, టామ్‌కామ్ పేరుతో కాకుండా ‘ఫెయిర్ స్ట్రీట్’ అనే ప్రైవేట్ సంస్థ పేరుతో ఒప్పందాలు చేసుకున్నారని తెలిపారు. 200 మంది నుంచి డబ్బులు వసూలు చేసి, 10 మందిని కూడా జర్మనీకి పంపలేదని అన్నారు. మెకాట్రానిక్స్ ఉద్యోగం అని చెప్పి పంపిన ఓ యువకుడికి అక్కడ కత్తి ఇచ్చి బీఫ్, మటన్ కోయమన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి వివేక్ తన కుమారుడు గడ్డం వంశీకృష్ణను ఇలాగే పంపిస్తారా? అని ప్రశ్నించారు.