- మదర్ డెయిరీ పాల ధరలు లీటరుకు రూ.2-4 పెంపు
- నవంబర్ 12 నుంచి కొత్త ధరలు అమల్లోకి
- ఫుల్ క్రీమ్ పాల ధర రూ.76
- టోన్డ్ ప్యాకెట్ పాలు రూ.62కు పెంపు
- పాడి రైతుల నుంచి సేకరణ ధరలు పెరగడమే కారణమన్న సంస్థ
పాల ధరలు మరోసారి పెరగనున్నాయి. ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ మదర్ డెయిరీ లీటరు పాల ధరలను రూ.2 నుంచి రూ.4 వరకు పెంచింది. సవరించిన ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. పాడి రైతుల నుంచి పాలు సేకరించే ధరలు పెరగడంతో ఉత్పత్తి వ్యయం అధికమైందని, ఆ భారంలో కొంత భాగాన్ని వినియోగదారులపై మోపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తొలుత ఈ ధరల పెంపును ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో అమలు చేయనున్నారు.
కొత్త ధరల ప్రకారం ఫుల్ క్రీమ్ ప్యాకెట్ పాల లీటరు ధర రూ.72 నుంచి రూ.76కు పెరిగింది. టోన్డ్ ప్యాకెట్ పాలు రూ.60 నుంచి రూ.62కు చేరాయి. డబుల్ టోన్డ్ పాలు రూ.54 నుంచి రూ.56కు పెరిగాయి. ఆవు పాల ధర లీటరుకు రూ.62 నుంచి రూ.65కు చేరింది. బల్క్ వెండింగ్ కేంద్రాల ద్వారా విక్రయించే టోన్డ్ పాలు రూ.58 నుంచి రూ.60కు పెరిగాయి.
పాడి రైతుల నుంచి పాలు సేకరించేందుకు చెల్లించే ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మదర్ డెయిరీ తన పాల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంలో 75 నుంచి 80 శాతం వరకు రైతులకు చెల్లిస్తోంది.
ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో మదర్ డెయిరీ రోజుకు సుమారు 35 లక్షల లీటర్ల పాలను విక్రయిస్తోంది. సంస్థకు చెందిన అవుట్‌లెట్లు, సాధారణ విక్రయ కేంద్రాలు, ఆన్‌లైన్ వేదికల ద్వారా ఈ అమ్మకాలు సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా రోజువారీ పాల విక్రయాలు 50 లక్షల లీటర్లకు పైగా ఉన్నాయి. ఈ ఏడాది మే 14న చివరిసారిగా ధరలను సవరించిన సంస్థ.. ఆరు నెలల వ్యవధిలో మరోసారి పెంపు నిర్ణయం తీసుకుంది.