- లడఖ్‌లో భారత వాయుసేన చారిత్రక ఘనత
- 13,629 అడుగుల ఎత్తులో ఐఎల్-76ఎండీ ల్యాండింగ్
- న్యోమా ఎయిర్‌ఫీల్డ్‌లో విజయవంతంగా దిగిన విమానం
- ఈ తరహా విమానానికి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ల్యాండింగ్
- ఎల్ఏసీకి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఎయిర్‌ఫీల్డ్
- తక్కువ గాలి సాంద్రతలో ల్యాండింగ్ చేయడం సవాలు
లడఖ్‌లో భారత వాయుసేన అరుదైన ఘనత సాధించింది. అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో భారీ విమానాలను నడిపే సామర్థ్యాన్ని చాటుతూ.. ఐఎల్-76ఎండీ (IL-76MD) రవాణా విమానాన్ని 13,629 అడుగుల ఎత్తులో విజయవంతంగా ల్యాండ్ చేసింది. తూర్పు లడఖ్‌లోని న్యోమా ఎయిర్‌ఫీల్డ్‌లో ఈ చారిత్రక ల్యాండింగ్ జరిగింది. ప్రపంచంలో ఈ తరహా విమానానికి ఇదే అత్యంత ఎత్తులో జరిగిన ల్యాండింగ్ అని భారత వాయుసేన ప్రకటించింది.
ఈ ఘనతకు సంబంధించిన ఫొటోలు, వీడియోను వాయుసేన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. విమానం సామర్థ్యంతోపాటు సిబ్బంది నైపుణ్యం, కచ్చితత్వం, వృత్తి నైపుణ్యానికి ఈ విజయం నిదర్శనమని పేర్కొంది. దేశ వ్యూహాత్మక రవాణా సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే కీలక ముందడుగుగా అభివర్ణించింది.
చైనా సరిహద్దులోని వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)కి సమీపంలో న్యోమా ఎయిర్‌ఫీల్డ్ ఉంది. సరిహద్దుకు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో సైనికపరంగా దీనికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇక్కడి ఎత్తైన ప్రాంతాల్లో గాలి సాంద్రత తక్కువగా ఉంటుంది. దీంతో విమానాలకు ఇంజిన్ పనితీరు, గాల్లోకి లేచే సామర్థ్యం తగ్గుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారీ రవాణా విమానాన్ని సురక్షితంగా దించడం సవాలుతో కూడుకున్న పని.
రష్యా మూలాలున్న ఐఎల్-76ఎండీ నాలుగు ఇంజిన్ల భారీ రవాణా విమానం. సైనికులు, ఆయుధ సామగ్రి, ఇతర భారీ సరకులను మారుమూల ప్రాంతాలకు తరలించేందుకు వాయుసేన దీన్ని వినియోగిస్తోంది. న్యోమాలో ఈ విమానం ల్యాండింగ్ కావడం సరిహద్దు ప్రాంతాల్లో సైనిక అవసరాలకు వేగంగా స్పందించే భారత సామర్థ్యాన్ని చాటిందని రక్షణ రంగ వర్గాలు పేర్కొంటున్నాయి.