- వాట్సాప్లో పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకునే సదుపాయం ప్రారంభం
- చివరి ఐదు లావాదేవీల వివరాలూ అందుబాటులోకి
- పీఎఫ్ పాస్‌బుక్ సమాచారాన్ని కూడా పొందే వీలు
- రూ.1,000లోపు నిలిచిపోయిన ఖాతాలకు ఆటోమేటిక్ సెటిల్మెంట్
- ఆధార్, బ్యాంకు వివరాల ధ్రువీకరణ తప్పనిసరి
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) చందాదారులకు శుభవార్త. ఇకపై వాట్సాప్ ద్వారానే పీఎఫ్ ఖాతాలో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవచ్చు. ఖాతాలో ఇటీవల జరిగిన ఐదు లావాదేవీల వివరాలను చూడటంతో పాటు పీఎఫ్ పాస్‌బుక్ సమాచారాన్ని కూడా పొందవచ్చు. ఈ కొత్త సదుపాయాన్ని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ప్రారంభించారు. ఈ సేవలతో సాధారణ ఖాతా వివరాల కోసం ఈపీఎఫ్ కార్యాలయాలను సంప్రదించాల్సిన అవసరం తగ్గనుంది.
ఈ సేవలను వినియోగించుకునేందుకు చందాదారులు ఈపీఎఫ్‌వో అధికారిక వాట్సాప్ సేవను మాత్రమే ఉపయోగించాలి. అందుబాటులో ఉన్న సేవల్లో పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం, చివరి ఐదు లావాదేవీలను పరిశీలించడం, పాస్‌బుక్ వివరాలను పొందడం ఉన్నాయి. ‘ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన’ (పీఎంవీబీఆర్‌వై)కు సంబంధించిన అవసరాలను పూర్తి చేసేందుకు వ్యక్తిగత మార్గదర్శకత్వం, సహాయం కూడా ఈ సేవ ద్వారా అందించనున్నారు.
వాట్సాప్ సేవతో పాటు మరో కీలక నిర్ణయాన్ని ఈపీఎఫ్‌వో ప్రకటించింది. ఆధార్ ధ్రువీకరణ పూర్తయిన, నిలిచిపోయిన పీఎఫ్ ఖాతాల్లో రూ.1,000 లేదా అంతకంటే తక్కువ మొత్తం ఉన్న అర్హులైన చందాదారులకు డబ్బు తిరిగి చెల్లించే ప్రక్రియను ఆటోమేటిక్‌గా ప్రారంభించనున్నారు. ఇందుకోసం చందాదారులు ప్రత్యేకంగా క్లెయిమ్ దాఖలు చేయాల్సిన అవసరం ఉండదు. అయితే గుర్తింపు, బ్యాంకు ఖాతా వివరాల ధ్రువీకరణ పూర్తయ్యాకే ఈ ప్రక్రియ చేపడతారు. ఈ సదుపాయం ద్వారా సుమారు లక్ష ఖాతాలకు చెందిన రూ.5 కోట్ల వరకు ప్రయోజనం చేకూరుతుందని అంచనా.