- ఏపీలో జంగిల్ రాజ్ పాలన నడుస్తోందని విడదల రజని ఆరోపణ
- కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలపై దాడులు చేస్తోందని విమర్శ
- పోలీసుల అండతో టీడీపీ నేతలు బి-ఫారాలు చించేశారని ఆరోపణ
ఆంధ్రప్రదేశ్‌లో దాడులు, దౌర్జన్యాలు, అక్రమాలతో 'జంగిల్ రాజ్' పాలన కొనసాగుతోందని వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజని విమర్శించారు. రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అనేక అక్రమాలు చోటుచేసుకున్నారని ఆరోపించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచే కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులపై దాడులకు దిగిందని మండిపడ్డారు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా విధ్వంసమైందని, ఏపీని బీహార్ రాష్ట్రంలా మార్చేశారని ఆమె ధ్వజమెత్తారు. పోలీసుల అండదండలతోనే టీడీపీ మూకలు దాడులు చేస్తున్నాయని ఆరోపించారు. నామినేషన్ కేంద్రాల్లో అధికారుల సమక్షంలోనే వైసీపీ అభ్యర్థుల బి-ఫారాలను చించేశారని... అధికారులు, పోలీసులు ఓటర్ల హక్కులను కాలరాశారని విమర్శించారు.
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో చంద్రబాబు ప్రభుత్వం పాల్పడుతున్న దాడులను ఎదుర్కొంటూనే, ప్రజల పక్షాన తమ పోరాటాన్ని కొనసాగిస్తామని విడదల రజని స్పష్టం చేశారు.