శిశువు వైద్యం కోసం మంత్రిని ఆశ్రయించిన దంపతులు.. అండగా నిలిచిన కోమటిరెడ్డి
- బధిర దంపతుల బిడ్డ వైద్యానికి మంత్రి కోమటిరెడ్డి చేయూత
- తక్షణ సాయంగా రూ. 2 లక్షల ఆర్థిక సహాయం
- చిన్నారి సర్జరీ ఖర్చు మొత్తం భరిస్తానని హామీ
తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన ఉదారతను చాటుకున్నారు. పుట్టుకతో మాట, వినికిడి లోపంతో బాధపడుతున్న నవజాత శిశువు వైద్యం కోసం ఓ నిరుపేద బధిర దంపతులకు ఆయన రూ. 2 లక్షల ఆర్థిక సహాయం అందించారు. చికిత్సకు అయ్యే పూర్తి ఖర్చును తానే భరిస్తానని హామీ ఇచ్చి వారికి అండగా నిలిచారు.
వివరాల్లోకి వెళితే, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఫణిగిరి గ్రామానికి చెందిన జంపాల మహేశ్ కుమార్, రజిత దంపతులు పుట్టుకతోనే మూగ, బధిరులు. ఇటీవల వారికి జన్మించిన శిశువుకు కూడా ఇదే సమస్య ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్న వయసులోనే సర్జరీ చేస్తే బిడ్డకు మాట, వినికిడి వచ్చే అవకాశం ఉందని, అయితే అందుకు లక్షల్లో ఖర్చవుతుందని తెలిపారు.
ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఆ దంపతులు హైదరాబాద్‌లో మంత్రి కోమటిరెడ్డిని ఈరోజు కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. వారి పరిస్థితికి చలించిపోయిన మంత్రి, చిన్నారిని చేతుల్లోకి తీసుకుని వారికి ధైర్యం చెప్పారు. తక్షణ వైద్య ఖర్చుల నిమిత్తం వెంటనే రూ. 2 లక్షల రూపాయల సాయాన్ని అందించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, "మీ చిన్నారి గురించి ఆందోళన వద్దు. ఆ బిడ్డకు మాటలు వచ్చేలా చేసే బాధ్యత నాది. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేనున్నాను" అని వారికి భరోసా ఇచ్చారు. అంతేకాకుండా, మెరుగైన శస్త్రచికిత్స కోసం ప్రత్యేక వైద్యులతో తానే స్వయంగా మాట్లాడతానని హామీ ఇచ్చారు. మంత్రి హామీతో ఆ దంపతులు భావోద్వేగానికి గురై కృతజ్ఞతలు తెలిపారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్న మంత్రి కోమటిరెడ్డిని స్థానికులు ప్రశంసించారు.