విష్ణువు చివరి అవతారమైన ‘కల్కి’గా మోదీ కనిపిస్తున్నారు.. భూటాన్ ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు
- ప్రధాని మోదీపై భూటాన్ ప్రధాని పీఎం టోబ్గే ప్రశంసల వర్షం
- గ్లోబల్ సౌత్ గొంతుకను ప్రపంచ వేదికపై వినిపించడంలో మోదీ కీలక పాత్ర పోషించారని వ్యాఖ్య
- 2019లోనే మోదీని విష్ణువు అవతారంగా పేర్కొన్న విషయాన్ని గుర్తు చేసుకున్న టోబ్గే
- ‘వికసిత్ భారత్’ అంటే ‘వికసిత్ భూటాన్’ కూడా అని వ్యాఖ్య
- ప్రజా జీవితంలో మోదీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వ్యాఖ్యలు
భారత ప్రధాని నరేంద్ర మోదీపై భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే ప్రశంసల వర్షం కురిపించారు. మోదీని తనకు అన్నయ్యగా భావిస్తానని, ఆయనను విష్ణువు అవతారంగా కూడా చూస్తానని చెప్పారు. మోదీ 25 ఏళ్లుగా ప్రభుత్వ అధినేతగా కొనసాగుతూ ప్రజా సేవ చేస్తున్న తీరును కొనియాడారు.
మోదీ నాయకత్వంలో పొరుగు దేశాలతో సంబంధాలకు భారత్ ప్రాధాన్యం ఇస్తోందని టోబ్గే పేర్కొన్నారు. గ్లోబల్ సౌత్ దేశాల గొంతుకను ప్రపంచ వేదికపై బలంగా వినిపించడంలో మోదీ కీలక పాత్ర పోషించారని చెప్పారు. ఆఫ్రికన్ యూనియన్‌ను జీ20లో శాశ్వత సభ్యుడిగా చేర్చడంలోనూ ఆయన కృషిని ప్రశంసించారు.
మోదీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న టోబ్గే.. ఆయనను చాలాకాలంగా అన్నయ్యగా భావిస్తున్నానని తెలిపారు. తర్వాత ఆయనను మార్గదర్శకుడిగా కూడా చూసినట్లు చెప్పారు. 2019లో మోదీని విష్ణువు అవతారంగా పేర్కొన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. 2024లో ఢిల్లీలో మోదీని కలిసినప్పుడు తాను గతంలో చెప్పిన మాటల గురించి ఆలోచించానని, తాను తప్పుగా చెప్పలేదని తేల్చుకున్నానన్నారు.
విష్ణువు చివరి అవతారమైన కల్కిగా మోదీ కనిపిస్తున్నారని టోబ్గే అన్నారు. అశాంతిని తొలగించి ధర్మాన్ని పునరుద్ధరించి కొత్త మార్పుకు నాంది పలికే అవతారమే కల్కి అని పేర్కొన్నారు.
‘వికసిత్ భారత్’ అంటే ‘వికసిత్ భూటాన్’ కూడా అని టోబ్గే వ్యాఖ్యానించారు. 2014లో ప్రధాని అయిన కొద్ది వారాల్లోనే మోదీ తన తొలి విదేశీ పర్యటనకు భూటాన్‌ను ఎంచుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆ పర్యటనలో భారత్-భూటాన్ సంబంధాలను ‘బీ4బీ’గా మోదీ అభివర్ణించారని తెలిపారు. అంటే ‘భూటాన్ కోసం భారత్.. భారత్ కోసం భూటాన్’ అని వివరించారు.
భూటాన్ అభివృద్ధి ప్రణాళికలకు భారత్ అందిస్తున్న సహకారాన్ని టోబ్గే ప్రశంసించారు. 13వ పంచవర్ష ప్రణాళిక కోసం భారత్ అందించే సాయాన్ని మోదీ ప్రభుత్వం రూ.10 వేల కోట్లకు పెంచిందని చెప్పారు.
విద్య, వైద్యం, మౌలిక వసతులు, జల విద్యుత్, సాంకేతికత, వ్యవసాయం, వ్యాపార రంగాల్లో ఇరు దేశాల సహకారం విస్తరించిందన్నారు. భూటాన్ రాజు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గెలెఫు మైండ్‌ఫుల్‌నెస్ సిటీ ప్రాజెక్టుకు భారత్ పూర్తి మద్దతు ఇస్తోందని తెలిపారు. రైలు మార్గాలు, సరిహద్దు మౌలిక వసతులు, విమాన, డిజిటల్ కనెక్టివిటీ అభివృద్ధి దిశగా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.