ఎయిర్‌టెల్ వినియోగదారులకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరల పెంపు
- పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరలను 3 నుంచి 10 శాతం పెంచిన భారతీ ఎయిర్‌టెల్
- కొత్తగా అన్ని ప్లాన్లపైనా ఉచిత అంతర్జాతీయ రోమింగ్ ప్రయోజనం
- రేపటి నుంచి కొత్త టారిఫ్‌లు అమల్లోకి వస్తాయని వెల్లడి
- రూ. 499 నుంచి రూ. 1,799 వరకు అందుబాటులో నూతన ప్లాన్లు
- ప్రతి సిమ్‌కు ఏడాదికి ఒకసారి ఉచిత ఫారిన్ ట్రిప్ బెనిఫిట్
దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ తన పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు షాకిచ్చింది. పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల టారిఫ్‌లను సుమారు 3 నుంచి 10 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన ఈ కొత్త ధరలు గురువారం నుంచే అమల్లోకి వస్తాయని కంపెనీ స్పష్టం చేసింది. అయితే, ధరల పెంపుతో పాటు వినియోగదారులను ఆకర్షించేందుకు కొత్తగా ఉచిత అంతర్జాతీయ రోమింగ్ (ఐఆర్) ప్రయోజనాన్ని కూడా జోడించింది.
కొత్తగా అంతర్జాతీయ రోమింగ్ బెనిఫిట్
తాజాగా సవరించిన ప్లాన్లన్నింటిలోనూ ప్రతి సిమ్‌కు ఏడాదికి ఒకసారి ఉచితంగా అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్‌ను అందిస్తున్నట్లు ఎయిర్‌టెల్ తెలిపింది. ఈ కాంప్లిమెంటరీ ప్యాక్‌లో భాగంగా 5 రోజుల వ్యాలిడిటీతో 5జీబీ డేటా, 60 నిమిషాల కాల్స్, 25 అవుట్‌గోయింగ్ ఎస్ఎంఎస్, ఉచిత ఇన్‌కమింగ్ ఎస్ఎంఎస్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.
తరచూ విదేశీ ప్రయాణాలు చేసే వారికి ఈ కొత్త బెనిఫిట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కంపెనీ భావిస్తోంది. ఈ ప్లాన్ల కింద అపరిమిత డేటా, కాలింగ్ సౌకర్యాలు యథావిధిగా కొనసాగుతాయి.
పెరిగిన ప్లాన్ల ధరలు ఇలా..
నూతన మార్పుల ప్రకారం.. వ్యక్తిగత కనెక్షన్ల కోసం ఉద్దేశించిన రూ. 449 ప్లాన్ ధరను రూ. 499కి పెంచారు. ఇక ఫ్యామిలీ ప్లాన్ల విషయానికొస్తే, గతంలో రెండు సిమ్‌ల కోసం రూ. 699గా ఉన్న ప్లాన్ ధర ఇప్పుడు రూ. 749కి చేరింది. మూడు సిమ్‌లతో లభించే రూ. 999 ప్లాన్ కోసం ఇకపై రూ. 1,049 చెల్లించాల్సి ఉంటుంది.
అదేవిధంగా నాలుగు సిమ్‌ల కోసం రూ. 1,249, రూ. 1,449 ధరలతో ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఐదు సిమ్‌లతో పాటు నెట్‌ఫ్లిక్స్ స్టాండర్డ్ సబ్‌స్క్రిప్షన్‌తో వచ్చే ప్లాన్ ధరను రూ. 1,799గా నిర్ణయించారు.
ఉత్తమ సేవలే లక్ష్యం: ఎయిర్‌టెల్
ఈ మార్పులపై భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ అమిత్ త్రిపాఠి మాట్లాడుతూ.. "భారత మార్కెట్లో మా పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు అత్యుత్తమ శ్రేణి అనుభవాన్ని అందించడమే మా లక్ష్యం. దేశంలోనే అత్యుత్తమ నెట్‌వర్క్ అనుభవంతో పాటు, 5Gపై ఫాస్ట్ లేన్ టెక్నాలజీ, స్పామ్, మోసాల నుంచి నిరంతర రక్షణ కల్పిస్తున్నాం. ఇప్పుడు ఉచిత అంతర్జాతీయ రోమింగ్ ప్రయోజనాన్ని కూడా జోడించి మా కస్టమర్లకు మరింత విలువను అందిస్తున్నాం" అని వివరించారు.
ఈ కొత్త ప్లాన్లు రేపటి (గురువారం) నుంచి కొత్తగా పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ తీసుకునే వారందరికీ అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. ఇప్పటికే ఉన్న ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ లేదా పాత పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో ఉన్న వినియోగదారులు కూడా సులభంగా ఈ కొత్త ప్లాన్లకు అప్‌గ్రేడ్ అవ్వొచ్చు.