పోలీసుల అదుపులో రాహుల్ గాంధీ, ప్రియాంక.. ఢిల్లీ ఆకాశవాణి భవన్ వద్ద ఉద్రిక్తత
- సీఈసీ రాజీనామా కోరుతూ ఢిల్లీలో విపక్షాల భారీ నిరసన
- పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయానికి ఇండియా కూటమి ర్యాలీ
- బారికేడ్లు ఎక్కి నిరసన తెలిపిన రాహుల్ గాంధీ
- రాహుల్, ప్రియాంక, అఖిలేశ్ సహా పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- ఆకాశవాణి భవన్‌లో బైఠాయించి కొనసాగుతున్న ఆందోళన
దేశ రాజధాని ఢిల్లీ మంగళవారం విపక్షాల ఆందోళనతో దద్దరిల్లింది. ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో తీవ్ర అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘ఇండియా’ కూటమి చేపట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు, హైడ్రామాకు దారితీసింది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు పలువురు ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో విపక్ష ఎంపీలు పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం ‘నిర్వాచన్ సదన్’ వైపు నిరసన ర్యాలీగా బయలుదేరారు. అయితే, ఆకాశవాణి భవన్ సమీపంలో పోలీసులు భారీ బారికేడ్లు ఏర్పాటు చేసి వారిని మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ బారికేడ్లు ఎక్కి, చేతిలో జాతీయ జెండాను ప్రదర్శిస్తూ తన నిరసనను తీవ్రతరం చేశారు. అనంతరం ఇతర నేతలతో కలిసి రోడ్డుపైనే బైఠాయించారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఢిల్లీ పోలీసులు రంగప్రవేశం చేసి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, టీఎంసీ, శివసేన (యూబీటీ) సహా పలువురు విపక్ష ఎంపీలను అదుపులోకి తీసుకుని బస్సుల్లోకి ఎక్కించారు.
ఓటర్ల జాబితాల సవరణలో పారదర్శకత లోపించిందని, అవకతవకలు జరుగుతున్నాయని విపక్షాలు గత కొద్ది వారాలుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నాయి. ఈసీలో అంతర్గత విభేదాలు ఉన్నాయని కూడా వార్తలు వచ్చాయి.
దీనిపై రాహుల్ సోషల్ మీడియాలోనూ స్పందించారు. "జ్ఞానేశ్, ఇక ముగిసింది. రాజీనామా చేయాల్సిన సమయం వచ్చింది" అని ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.