- వ్యాపారం కోసం రష్యా వెళ్లిన హైదరాబాద్ వ్యాపారి
- నవంబర్ 2 నుంచి పోలీసుల అదుపులో ఉన్న ఆదిల్
- అరెస్టుకు గల కారణాలపై అందని సమాచారం
- విడిపించాలని కేంద్ర ప్రభుత్వానికి కుటుంబ సభ్యుల విజ్ఞప్తి
వ్యాపార నిమిత్తం రష్యాకు వెళ్లిన హైదరాబాద్ వ్యాపారవేత్తను అక్కడి పోలీసులు అరెస్టు చేయడం కలకలం సృష్టిస్తోంది. నవంబర్ 2వ తేదీ నుంచి జైలులోనే మగ్గుతుండటంతో, ఆయనను సురక్షితంగా విడిపించాలని బాధితుడి కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ పాత మౌలాలీకి చెందిన మహమ్మద్ ఆదిల్ మొహియుద్దీన్ (36) కుషాయిగూడలో మెడికల్ స్టోర్ నిర్వహిస్తున్నారు. తన వ్యాపారాన్ని విస్తరించడంతో పాటు వైద్య పరికరాల కొనుగోలు నిమిత్తం అక్టోబర్ 26న ఆయన సందర్శక వీసాపై రష్యాకు వెళ్లారు. ఉల్యానోవ్స్క్ ప్రాంతంలోని ఒక హోటల్‌లో బస చేస్తున్న ఆదిల్‌ను నవంబర్ 2న స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను అక్కడి ప్రీ-ట్రయల్ డిటెన్షన్ సెంటర్‌కు తరలించినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.
అయితే, ఆదిల్‌ను ఏ కారణంతో అరెస్టు చేశారు? ఆయనపై మోపిన అభియోగాలు ఏమిటి? అనే విషయాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఆయన మొబైల్ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదిల్ కుటుంబ సభ్యులు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్‌కు లేఖ రాశారు.
మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ద్వారా రష్యా అధికారులతో సంప్రదింపులు జరిపి, అరెస్టుకు గల కారణాలను తెలుసుకోవాలని వారు కోరారు. ఆదిల్‌కు అవసరమైన న్యాయ సహాయం అందించడంతో పాటు, ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం దౌత్యపరంగా జోక్యం చేసుకుని, తమ కుటుంబ సభ్యుడిని సురక్షితంగా భారత్‌కు తీసుకురావాలని వారు వేడుకుంటున్నారు.