- లొంగిపోయిన 214 మంది మావోయిస్టులకు రూ. 5.59 కోట్ల ఆర్థిక సాయం పంపిణీ
- గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలో 824 మంది మావోయిస్టులు లొంగిపోయారని వెల్లడి
- మావోయిస్టు భావజాల వ్యాప్తిని సహించబోమని డీజీపీ సీవీ ఆనంద్ హెచ్చరిక
- కర్రెగుట్టలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
ఇంకా లొంగిపోని మావోయిస్టు పార్టీ అగ్ర నాయకులు హింసను వీడి, జనజీవన స్రవంతిలో కలవాలని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి సహా మరో ఇద్దరు కీలక నేతలు ఆయుధాలు వీడి సాధారణ జీవితం గడపాలని ఆయన కోరారు. డీజీపీ కార్యాలయంలో లొంగిపోయిన మావోయిస్టులకు సోమవారం ఆర్థిక సాయం పంపిణీ చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా లొంగిపోయిన 214 మంది మావోయిస్టులకు రూ. 5.59 కోట్ల విలువైన ఆర్థిక సాయం, రివార్డులకు సంబంధించిన చెక్కులను డీజీపీ అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస పథకంలో భాగంగా వారికి ఆర్థిక సహాయం, వైద్యం, ఇళ్లు, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన వివరించారు.
కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 'ఆపరేషన్ కగార్' ప్రారంభమైన గత మూడేళ్లలో తెలంగాణలో మొత్తం 824 మంది మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ వెల్లడించారు. వీరిలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారు 754 మంది ఉండగా, తెలంగాణకు చెందిన వారు 59 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. ఆధార్ కార్డులు లేకపోవడంతో బ్యాంకు ఖాతాలు తెరవడంలో ఎదురైన సాంకేతిక ఇబ్బందులను ఛత్తీస్‌గఢ్ పోలీసుల సమన్వయంతో అధిగమించినట్లు ఆయన తెలిపారు.
లొంగిపోయిన వారు ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చని, అయితే మావోయిస్టు భావజాల వ్యాప్తిని ఏమాత్రం సహించబోమని డీజీపీ స్పష్టం చేశారు. మరోవైపు, తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్ట ప్రాంతంలో తొమ్మిది ఆయుధ డంపులను గుర్తించి, 48 ఏకే-47 రైఫిళ్లతో పాటు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆ ప్రాంతంలో ల్యాండ్మైన్ల నిర్వీర్య ప్రక్రియ పూర్తయ్యే వరకు పర్యాటకులకు అనుమతి లేదని ఆయన వెల్లడించారు.