కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- టీజీ ట్రాన్స్‌కోలో 26 శాతం వాటాల విక్రయాన్ని ఆపాలని వినతి
- ఇది విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు తొలి అడుగని ఆందోళన
- కాంగ్రెస్ జాతీయ విధానాలకు ఇది విరుద్ధమని లేఖలో ప్రస్తావన
- ప్రైవేటీకరణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న ట్రాన్స్‌కో
తెలంగాణలోని కీలక విద్యుత్ రంగ సంస్థల్లో వాటాల విక్రయం లేదా ప్రైవేటీకరణ ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాశారు. టీజీ ట్రాన్స్‌కోలో 26 శాతం వాటాలను ఐపీఓ ద్వారా విక్రయించి నిధులు సమీకరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ జాతీయ నాయకత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రజాధనంతో నిర్మితమైన టీజీ ట్రాన్స్‌కో, రాష్ట్ర విద్యుత్ సరఫరా వ్యవస్థకు వెన్నెముక వంటిదని హరీశ్ రావు తన లేఖలో పేర్కొన్నారు. వేలాది కిలోమీటర్ల మేర విస్తరించిన విద్యుత్ లైన్లు, హై-వోల్టేజ్ సబ్‌స్టేషన్లతో కూడిన ఈ సంస్థ అత్యంత విలువైన ఆస్తి అని వివరించారు. ట్రాన్స్‌కోలో ప్రైవేట్ వాటాలకు అనుమతినిస్తే, భవిష్యత్తులో టీజీ జెన్‌కో, సింగరేణి, డిస్కమ్‌ల ప్రైవేటీకరణకు కూడా ఇది మార్గం సుగమం చేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల మేనిఫెస్టో, 2023 రాయ్‌పూర్ తీర్మానాలకు విరుద్ధమని హరీశ్ రావు ప్రశ్నించారు. వ్యూహాత్మకంగా ప్రాధాన్యత లేని, నష్టాల్లో ఉన్న సంస్థల్లో మాత్రమే పెట్టుబడుల ఉపసంహరణకు కట్టుబడి ఉన్నామని గతంలో కాంగ్రెస్ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీ వంటి సంస్థలను ప్రైవేటీకరిస్తుంటే తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్, రాష్ట్రంలో అధికారంలోకి రాగానే అందుకు భిన్నంగా వ్యవహరించడం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని నిలదీశారు. విద్యుత్ సంస్థల యాజమాన్య హక్కులపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా, ప్రైవేటీకరణ, వాటాల విక్రయం లేదా పబ్లిక్ ఇష్యూపై ఇప్పటి వరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని టీజీ ట్రాన్స్‌కో వర్గాలు వెల్లడించాయి.