బీఆర్ఎస్‌తో పొత్తు, ఖైరతాబాద్‌లో బీజేపీ పోటీపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే?
- బీఆర్ఎస్‌తో బీజేపీ పొత్తు పెట్టుకోబోదని స్పష్టం చేసిన కిషన్ రెడ్డి
- ఓటమి భయంతోనే కాంగ్రెస్ ఈసీపై దాడి చేస్తోందని ఆరోపణ
- హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సీఎం రేవంత్ వ్యాఖ్యలు
- కాంగ్రెస్ దొంగ ఓట్లను చేర్పించే ప్రయత్నం చేస్తోందని విమర్శ
ఖైరతాబాద్ లో బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నాయకుడు జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాజకీయాల్లో ఈ పొత్తుపై జరుగుతున్న ఊహాగానాలకు ఆయన తెరదించారు. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యామని, అయితే ఈసారి బీజేపీ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే ముందుకు వెళుతుందని స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణలోని ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు బొగ్గు కేటాయింపులపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే, సింగరేణి బొగ్గును వినియోగించుకునేలా ఈ ప్లాంట్‌కు ఎందుకు రూపకల్పన చేయలేదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వైఖరిని కిషన్ రెడ్డి తీవ్రంగా ఎండగట్టారు. రాహుల్ గాంధీ రాజ్యాంగబద్ధమైన సంస్థలపై, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌పై అనుచిత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో మార్పు అనేది ప్రజల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందే తప్ప, రాహుల్ గాంధీ వల్ల సాధ్యం కాదన్నారు. శివుడు, రాముడిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని, వాటిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు.
ఓటమి భయంతోనే కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘంపై, బీజేపీపై అసత్య ఆరోపణలు చేస్తున్నాయని కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రాంతాల వారీగా ప్రజల మధ్య చిచ్చుపెడుతోందని, తొలగించిన ఓట్లను (మరణించిన వారు, అక్రమ చొరబాటుదారులు) తిరిగి ఓటర్ల జాబితాలో చేర్పించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఖైరతాబాద్‌లో బీజేపీ గెలుపు తథ్యమని, తమ పార్టీ ఓట్లను దొంగిలించదని, కేవలం ప్రజల హృదయాలను గెలుచుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు.