హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు మరో అంతర్జాతీయ సర్వీస్
- హైదరాబాద్ నుంచి తాష్కెంట్‌కు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- సెంట్రమ్ ఎయిర్ ఆధ్వర్యంలో వారానికి రెండుసార్లు నడవనున్న విమానాలు
- దక్షిణ భారతదేశం, మధ్య ఆసియాను కలిపే తొలి డైరెక్ట్ సర్వీస్ ఇదే
- మొత్తం 27 అంతర్జాతీయ గమ్యస్థానాలకు చేరిన హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నెట్‌వర్క్
ఉజ్బెకిస్థాన్ రాజధాని తాష్కెంట్‌కు హైదరాబాద్ (శంషాబాద్) నుంచి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. 'సెంట్రమ్ ఎయిర్' సంస్థ మంగళవారం నుంచి ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. వారానికి రెండుసార్లు ఈ సర్వీసులు నడవనున్నాయి. ఈ నూతన సర్వీసుతో దక్షిణ భారతదేశం, మధ్య ఆసియా మధ్య ప్రత్యక్ష విమాన అనుసంధానం ఏర్పడింది.
ఈ విమాన సర్వీసుల ప్రారంభ కార్యక్రమంలో జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రతినిధి కదిర్ కదిర్వన్, ఏరోప్రైమ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ అభిషేక్ గోయల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కదిర్ కదిర్వన్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరం ఒక ప్రముఖ మెడికల్ టూరిజం కేంద్రంగా ఎదుగుతున్న తరుణంలో, ఈ కొత్త అంతర్జాతీయ సర్వీసులు ప్రయాణికులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని తెలిపారు.
తాష్కెంట్‌తో కలిపి హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ప్రస్తుతం మొత్తం 27 అంతర్జాతీయ గమ్యస్థానాలకు విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇక దేశీయంగా 74 నగరాలకు విమాన రాకపోకలు సాగుతున్నాయి. ఈ కొత్త మార్గం ద్వారా వాణిజ్య, పర్యాటక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని విమానాశ్రయ అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.