అమెరికా వెళ్లాలనుకుంటున్నారా?.. వీసా ఇంటర్వ్యూకే ఏడాది నిరీక్షణ.. హైదరాబాద్‌లోనే అత్యధిక వెయిటింగ్ టైమ్!
- అమెరికా విజిటర్ వీసా ఇంటర్వ్యూలకు పెరిగిన నిరీక్షణ
- హైదరాబాద్‌లో అపాయింట్‌మెంట్ కోసం 12 నెలల వెయిటింగ్
- ముంబై, ఢిల్లీ, చెన్నైలలోనూ నెలల తరబడి తప్పని నిరీక్షణ
- విద్యార్థి, ఉద్యోగ వీసాలకు మాత్రం తక్కువ సమయంలోనే అపాయింట్‌మెంట్లు
అమెరికా వెళ్లాలనుకునే భారతీయ పర్యాటకులకు, వ్యాపారవేత్తలకు వీసా ప్రక్రియలో తీవ్ర జాప్యం ఎదురవుతోంది. ముఖ్యంగా విజిటర్ వీసా (బీ-1/బీ-2) కోసం ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ పొందాలంటే ఏకంగా 12 నెలల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. యూఎస్ విదేశాంగ శాఖ సెప్టెంబర్ 17న విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, దేశంలోని పలు కాన్సులేట్లలో భారీ వెయిటింగ్ టైమ్ ఉన్నట్లు స్పష్టమవుతోంది.
ఈ గణాంకాల ప్రకారం.. దేశంలోనే అత్యధికంగా హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్‌లో విజిటర్ వీసా ఇంటర్వ్యూ కోసం అందుబాటులో ఉన్న తదుపరి అపాయింట్‌మెంట్ 12 నెలల తర్వాత ఉంది. ఇక్కడ సగటు నిరీక్షణ సమయం 11.5 నెలలుగా నమోదైంది.
హైదరాబాద్ తర్వాత ముంబైలో 11 నెలల సగటు వెయిటింగ్ టైమ్ ఉండగా, న్యూఢిల్లీలో 7.5 నెలలు, చెన్నైలో 7 నెలల సగటు నిరీక్షణ సమయం ఉంది. చెన్నై కాన్సులేట్‌లో మిగతా నగరాలతో పోలిస్తే కాస్త తక్కువ జాప్యం జరుగుతోంది.
అయితే, ఈ సుదీర్ఘ నిరీక్షణ కేవలం విజిటర్ వీసాలకే పరిమితం కావడం గమనార్హం. విద్యార్థి వీసాలు (ఎఫ్, ఎం, జే), వృత్తి నిపుణుల వీసాల (హెచ్, ఎల్, ఓ, పీ, క్యూ) అపాయింట్‌మెంట్లు మాత్రం చాలా వేగంగా లభిస్తున్నాయి.
చెన్నైలో స్టూడెంట్ వీసా అపాయింట్‌మెంట్ అర నెలలోపే దొరుకుతుండగా, హైదరాబాద్‌లో 1.5 నెలలు, న్యూఢిల్లీలో 2 నెలలు, ముంబైలో 2.5 నెలల్లో లభిస్తోంది.
ఆగస్టు నెలతో పోలిస్తే సెప్టెంబర్‌లో ముంబైలో నిరీక్షణ సమయం 14 నెలల నుంచి 11 నెలలకు తగ్గగా, హైదరాబాద్‌లో మాత్రం 9.5 నెలల నుంచి 11.5 నెలలకు పెరిగింది. ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది కేవలం అంచనా మాత్రమేనని, కచ్చితమైనది కాదని అధికారులు చెబుతున్నారు.
ఎప్పటికప్పుడు అదనపు స్లాట్లను విడుదల చేస్తుంటామని, ఇప్పటికే అపాయింట్‌మెంట్ బుక్ చేసుకున్నవారు ముందు తేదీలు లభిస్తే రీషెడ్యూల్ చేసుకోవచ్చని సూచిస్తున్నారు. అర్హులైన కొంతమందికి ఇంటర్వ్యూ మినహాయింపు కూడా లభించే అవకాశం ఉందని, ఆ వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవాలని తెలిపారు.