- అమెరికాలో 54.1 లక్షలకు చేరిన భారతీయుల జనాభా
- భారత మూలాలున్న వారిని కలిపి లెక్కిస్తే సంఖ్య 59.1 లక్షలు
- ఏడాదిలో భారతీయుల సంఖ్య 3.15 లక్షలకు పైగా పెరిగిన వైనం
- భారతదేశంలో పుట్టి అమెరికాలో ఉంటున్న వారి సంఖ్య 34 లక్షలు
- కాలిఫోర్నియాలో అత్యధికంగా 10.2 లక్షల మంది భారతీయులు
అమెరికాలో భారతీయుల జనాభా గణనీయంగా పెరుగుతోంది. అక్కడ భారతీయులుగా తమను గుర్తించుకున్నవారి సంఖ్య 2025 నాటికి 54.1 లక్షలకు చేరింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 3.15 లక్షలకు పైగా పెరిగింది. అమెరికా జనగణన విభాగం విడుదల చేసిన తాజా అమెరికన్ కమ్యూనిటీ సర్వే (ఏసీఎస్) గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది.
59 లక్షలకు చేరిన మొత్తం సంఖ్య
తమను భారతీయులుగా మాత్రమే గుర్తించుకున్నవారితో పాటు భారతీయ మూలాలు ఉండి ఇతర జాతీయులుగా పేర్కొన్న వారిని కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య 59.1 లక్షలకు చేరింది. 2024లో ఈ సంఖ్య 55.6 లక్షలుగా ఉంది. అంటే ఏడాదిలోనే గణనీయమైన పెరుగుదల నమోదైంది. అమెరికాలో ఒకే ఆసియా జాతి వర్గంగా భారతీయులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఈ విభాగంలో చైనీయులు (తైవాన్ మినహా) 46.5 లక్షలతో తర్వాతి స్థానంలో ఉన్నారు.
భారతదేశంలో పుట్టినవారు 34 లక్షలు
అమెరికాలో నివసిస్తున్న వలసదారుల్లో మెక్సికో తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. 2025 నాటికి భారత్‌లో పుట్టి అమెరికాలో నివసిస్తున్నవారి సంఖ్య 34 లక్షలకు చేరింది. 2024లో ఇది 31.6 లక్షలుగా ఉంది. మెక్సికోలో పుట్టి అమెరికాలో ఉంటున్నవారి సంఖ్య 1.06 కోట్లుగా నమోదైంది. విదేశాల్లో పుట్టిన నివాసితుల సంఖ్య అమెరికాలో 5.04 కోట్లకు పైగా ఉన్నారు.
కాలిఫోర్నియాలో అత్యధికం
అమెరికా రాష్ట్రాల వారీగా చూస్తే కాలిఫోర్నియాలో భారతీయుల సంఖ్య అత్యధికంగా 10.2 లక్షలుగా ఉంది. టెక్సాస్‌లో 7.08 లక్షలు, న్యూజెర్సీలో 4.71 లక్షలు, న్యూయార్క్‌లో 4.20 లక్షలు, ఇల్లినాయిస్లో 2.88 లక్షల మంది ఉన్నారు. ఫ్లోరిడాలో 2.39 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు.
కుటుంబ ఆదాయం 84,780 డాలర్లు
ఈ సర్వేలో అమెరికా కుటుంబాల ఆదాయం, వాహన వినియోగం, మురుగునీటి పారుదల సదుపాయాల వివరాలనూ సేకరించారు. 2025లో అమెరికాలో మధ్యస్థ కుటుంబ ఆదాయం 84,780 డాలర్లకు చేరింది. అంతకుముందు ఏడాది ఇది 81,604 డాలర్లుగా ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలు కలిగిన లేదా లీజుకు తీసుకున్న కుటుంబాల వాటా కాలిఫోర్నియాలో 14 శాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా ఈ వాటా 5.5 శాతంగా ఉంది. శాంటా క్లారా కౌంటీలో ఇది 24 శాతానికి చేరడం విశేషం.