గూగుల్ ఫొటోస్‌లో అదిరిపోయే అప్‌డేట్స్.. కొత్తగా ఏం వచ్చాయంటే..!
- గూగుల్ ఫొటోస్‌లో కొత్తగా అందుబాటులోకి రెడాక్ట్ పెన్
- ఫొటోల్లో సున్నితమైన సమాచారాన్ని బ్లర్ చేసే ఛాన్స్
- మూడ్స్‌తో 35ఎంఎం ఫిల్మ్, డిజిక్యామ్ లుక్ ఇచ్చే అవకాశం
- 15 కొత్త రీమిక్స్ టెంప్లేట్లు కూడా అందుబాటులోకి
- జెమిని స్పార్క్‌తో ఫొటోలు ఎంచుకుని ఎడిట్ చేసి షేర్ చేసే అవకాశం
ఫొటోలు ఎడిట్ చేయడం, ఆర్గనైజ్ చేసుకోవడాన్ని మరింత సులభం చేసేలా గూగుల్ ఫొటోస్‌లో కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో రెడాక్ట్ పెన్, మూడ్స్, కొత్త రీమిక్స్ టెంప్లేట్లు, ఏఐ వార్డ్‌రోబ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. జెమినీ స్పార్క్‌ను కూడా గూగుల్ ఫొటోస్‌తో అనుసంధానిస్తోంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఆయా ఫీచర్లు ప్రాంతాలను బట్టి అందుబాటులోకి వస్తున్నాయి.
సున్నితమైన సమాచారాన్ని బ్లర్ చేయొచ్చు
గూగుల్ ఫొటోస్ మార్కప్ టూల్‌ను అప్‌గ్రేడ్ చేసింది. ఇందులో కొత్తగా రెడాక్ట్ పెన్ తీసుకొచ్చింది. దీని సాయంతో ఫొటోల్లో కనిపించే సున్నితమైన సమాచారాన్ని బ్లర్ చేయొచ్చు. పెన్ మందాన్ని కూడా మార్చుకునే అవకాశం ఉంది. ఫొటోపై టెక్స్ట్ రాసేందుకు కొత్త ఫాంట్లు కూడా జోడించింది.
పాతకాలం లుక్ కోసం మూడ్స్
ఆండ్రాయిడ్‌లో మూడ్స్ ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తోంది. 35ఎం.ఎం ఫిల్మ్, 2000ల డిజిక్యామ్ తరహా పాతకాలం లుక్‌ను ఫొటోలకు ఇవ్వొచ్చు. ఎఫెక్ట్ ఎంత ఉండాలనేది స్లైడర్‌తో సెట్ చేసుకోవచ్చు.
అలాగే ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లో ఎంపిక చేసిన దేశాల్లో 15 కొత్త రీమిక్స్ టెంప్లేట్లు వస్తున్నాయి. రెడ్‌కార్పెట్ స్టైల్ ఫొటోలు, బర్త్‌డే కార్డులు, ఫొటోబూత్ షాట్ల వంటి వాటిని వీటితో రూపొందించుకోవచ్చు. ఈ ఫీచర్ 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఏఐతో వార్డ్‌రోబ్ కూడా..
ఏఐ వార్డ్‌రోబ్ ఫీచర్‌ను అమెరికా, భారత్, బ్రెజిల్‌లో అర్హత ఉన్న ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు గూగుల్ విస్తరించింది. ఫొటోల్లో కనిపించే దుస్తులను డిజిటల్ కలెక్షన్‌గా సర్దుకోవచ్చు. వాటితో కొత్త కాంబినేషన్లు చూసుకోవడంతో పాటు వర్చువల్ స్టైలింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ వార్డ్‌రోబ్ డేటాను రిటైలర్ల వంటి థర్డ్ పార్టీలతో పంచుకోబోమని గూగుల్ తెలిపింది.
ఒక్క ప్రాంప్ట్‌తో ఫొటో ఎంపిక, ఎడిటింగ్
జెమినీ స్పార్క్ ఇప్పుడు గూగుల్ ఫొటోస్‌లోని ఫొటోలను కూడా ఉపయోగించుకోగలదు. ఉదాహరణకు కుటుంబ ఫొటోల్లో మంచి చిత్రాలను ఎంచుకుని, వాటి బ్రైట్‌నెస్ పెంచి, షేర్ చేసేందుకు సిద్ధం చేయమని ఒకే ప్రాంప్ట్‌తో చెప్పొచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం అమెరికాలోని అర్హత ఉన్న గూగుల్ ఏఐ ప్రో, అల్ట్రా సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.