- గూగుల్ ఫొటోస్ బిన్ గడువు 60 నుంచి 30 రోజులకు తగ్గింపు
- 2026 డిసెంబర్ 5 నుంచి కొత్త విధానం అమలు
- అప్పటికే బిన్లో ఉన్న ఫొటోలకు పాత గడువే వర్తింపు
- గడువు దాటితే ఫొటోలు శాశ్వతంగా తొలగింపు
- పోస్టర్ల నుంచి ఈవెంట్ వివరాలను గుర్తించే ఏఐ ఫీచర్
గూగుల్ ఫొటోస్ వినియోగదారులకు కీలక సమాచారం. యాప్‌లో డిలీట్ చేసిన ఫొటోలు, వీడియోలను తిరిగి పొందేందుకు ప్రస్తుతం ఇస్తున్న 60 రోజుల గడువును గూగుల్ 30 రోజులకు తగ్గించనుంది. ఈ కొత్త విధానం డిసెంబర్ 5 నుంచి అమల్లోకి రానుంది. మరోవైపు ఫొటోల్లోని ఈవెంట్ వివరాలను గుర్తించి నేరుగా గూగుల్ క్యాలెండర్లో నమోదు చేసే కొత్త ఫీచర్‌ను కూడా తీసుకొచ్చేందుకు సంస్థ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
డిసెంబర్ 5 నుంచి బిన్‌లోకి వెళ్లే కొత్త ఫైళ్లకు మాత్రమే ఈ మార్పు వర్తిస్తుంది. అంతకు ముందే బిన్లో ఉన్న ఫొటోలు, వీడియోలకు మాత్రం పాత 60 రోజుల గడువే కొనసాగుతుంది. నిర్దేశిత గడువు ముగిసిన తర్వాత అవి శాశ్వతంగా తొలగిపోతాయి. ఆ తర్వాత బిన్ నుంచి తిరిగి పొందడం సాధ్యం కాదు. కాబట్టి పొరపాటున ఫొటోలు తొలగించినవారు ఆలస్యం చేయకుండా వాటిని రికవర్ చేసుకోవడం మంచిది.
మరోవైపు గూగుల్ ఫొటోస్‌లో త్వరలో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఫొటోల్లో ఉన్న ఈవెంట్ పోస్టర్లు, ప్రకటనలను గుర్తించి వాటిలోని వివరాలతో నేరుగా క్యాలెండర్లో ఈవెంట్ నమోదు చేసుకునే సదుపాయాన్ని తీసుకొస్తున్నట్లు ఆండ్రాయిడ్ అథారిటీ కథనం వెల్లడించింది.
గూగుల్ ఫొటోస్ 8.0 యాప్ కోడ్‌ను పరిశీలించినప్పుడు 'యాడ్ టు క్యాలెండర్' అనే ఆప్షన్ కనిపించినట్లు తెలిపింది. గూగుల్ ఏఐ ఆధారిత 'ఆస్క్ ఫొటోస్' ఫీచర్ సాయంతో పోస్టర్‌లోని కార్యక్రమం పేరు, తేదీ, సమయం, వివరణను గుర్తించి క్యాలెండర్లో నమోదు చేసేలా దీన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం వినియోగదారులు క్యాలెండర్ యాక్సెస్‌కు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఆటోమేటిక్‌గా రూపొందించిన క్యాలెండర్ ఎంట్రీలో అసలు పోస్టర్ ఫొటోకు లింక్ కూడా ఉంటుందని సమాచారం.