చర్లపల్లి జైలులో ప్రణయ్ కేసు దోషికి గుండెపోటు.. గాంధీ ఆస్పత్రిలో కన్నుమూత
- ప్రణయ్ పరువు హత్య కేసులో దోషి అబ్దుల్ బారి మృతి
- ఈ కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న బారి
- ప్రధాన నిందితుడు మారుతీరావు గతంలోనే ఆత్మహత్య
- అమృతను కులాంతర వివాహం చేసుకున్నందుకు ప్రణయ్ హత్య
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న దోషి అబ్దుల్ బారి (50) గురువారం మృతి చెందాడు. హైదరాబాద్‌లోని చర్లపల్లి కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న అతడికి మధ్యాహ్నం 3 గంటల సమయంలో గుండెపోటు రావడంతో జైలు సిబ్బంది వెంటనే సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బారి మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు.
2018 సెప్టెంబర్ 14న నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పెరుమాళ్ల ప్రణయ్ కుమార్‌ని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. తన కుమార్తె అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడనే కక్షతో ఆమె తండ్రి, వ్యాపారవేత్త మారుతీరావు సుమారు రూ. కోటి సుపారీ ఇచ్చి ఈ హత్య చేయించినట్లు అభియోగాలు నమోదయ్యాయి. గర్భిణిగా ఉన్న భార్య అమృత కళ్లెదుటే జరిగిన ఈ దారుణ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
ఈ కేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావు 2020 మార్చిలో బెయిల్‌పై ఉన్న సమయంలో ఆత్మహత్య చేసుకున్నారు. సుదీర్ఘ విచారణ అనంతరం నల్గొండ ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టు.. హత్యకు పాల్పడిన సుభాష్ కుమార్ శర్మకు మరణశిక్ష విధించగా, కుట్రలో భాగస్వాములైన అస్గర్ అలీ, అబ్దుల్ బారి, మారుతీరావు సోదరుడు శ్రవణ్ కుమార్ సహా పలువురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ కేసులో నాలుగో నిందితుడైన బారి పేరు గతంలో గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్య హత్య కేసులోనూ వినిపించడం గమనార్హం.