మాదాపూర్‌ ఓయో కేసు.. నిఖిత మృతి కేసులో బిగ్‌ ట్విస్ట్‌

మాదాపూర్‌ ఓయో కేసు.. నిఖిత మృతి కేసులో బిగ్‌ ట్విస్ట్‌

Madhapur OYO case big twist in Nikhita death case
  • 21వ తేదీన ఓయో గదికి వచ్చిన నిఖిత, రవితేజ
  • ఓయోలో నిఖిత అనుమానాస్పద మృతి
  • అనకాపల్లి జిల్లాలోని స్వగ్రామంలో ఉన్న ఇంట్లో రవితేజ ఆత్మహత్యా యత్నం

హైదరాబాద్‌లోని మాదాపూర్ ఓయో హోటల్‌లో విశాఖకు చెందిన నిఖిత అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన అనుమానితుడిగా ఉన్న శ్రీనివాస రవితేజ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.


అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలోని తన స్వగ్రామం ఏడుమెట్ల మర్రిపాలెంలో ఉన్న ఇంట్లో రవితేజ ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కేజీహెచ్‌లో రవితేజకు వైద్యులు చికిత్స అందిస్తుండగా అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పరవాడ పోలీసులు మాదాపూర్ పోలీసులకు సమాచారం అందించారు.


కేసు నేపథ్యం:
విశాఖపట్నానికి చెందిన నిఖిత, రవితేజలు సెప్టెంబర్ 21న మాదాపూర్ సిద్దిఖీనగర్‌లోని ఓయో హోటల్‌లో గది తీసుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున నిఖిత అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో కొండాపూర్ అపోలో ఆసుపత్రికి తరలించగా, ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే నిఖిత ముఖం, తలపై తీవ్ర గాయాలు ఉండటం, హోటల్ గదిలోని గోడలు, బెడ్‌షీట్‌పై రక్తపు మరకలు, మద్యం సీసాలను క్లూస్ టీమ్ గుర్తించడంతో ఇది హత్యేనని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆసుపత్రిలో నిఖిత మరణించిందని తెలిసిన వెంటనే రవితేజ అక్కడి నుంచి పరారై ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు. గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలోనే అతడు స్వగ్రామంలో ఆత్మహత్యాయత్నం చేశాడు. ఫోరెన్సిక్ నివేదికలు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మాదాపూర్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

Advertisement
Srinivasa Raviteja
Nikhita death case
Madhapur OYO case
Hyderabad crime news
Visakhapatnam KGH hospital
Suspect suicide attempt

More Telugu News