హైదరాబాద్ ఓయోలో విశాఖ యువతి అనుమానాస్పద మృతి.. ప్రియుడు పరారీ!

హైదరాబాద్ ఓయోలో విశాఖ యువతి అనుమానాస్పద మృతి.. ప్రియుడు పరారీ!

Visakhapatnam girl suspicious death in Hyderabad OYO boyfriend absconding
  • మాదాపూర్ ఓయో హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి
  • ప్రియుడితో కలిసి హోటల్‌కు రాగా, తెల్లారేసరికి శవంగా యువతి
  • మృతురాలి శరీరంపై గాయాలు, గదిలో రక్తపు మరకల గుర్తింపు
  • ఘటన జరిగిన తర్వాత ఆసుప‌త్రి నుంచి పరారైన ప్రియుడు 
  • అనుమానాస్పద మృతిగా కేసు నమోదు.. ప్రియుడి కోసం పోలీసుల గాలింపు
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఓ యువతి అనుమానాస్పద రీతిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. సిద్దిఖీ నగర్‌లోని ఓ ఓయో హోటల్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రియుడితో కలిసి హోటల్‌కు వచ్చిన యువతి మరణించడం, అనంతరం అతను పరారీ కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన షారోన్‌ నిఖితా టోప్నో, తన ప్రియుడు శ్రీనివాస రవితేజతో కలిసి మాదాపూర్‌లోని ఓయో హోటల్‌లో రూమ్ నంబర్ 303 బుక్ చేసుకుంది. అయితే, అర్ధరాత్రి సమయంలో రవితేజ హోటల్ సిబ్బంది వద్దకు వచ్చి, తనతో ఉన్న నిఖితా అపస్మారక స్థితిలోకి వెళ్లిందని చెప్పాడు. సిబ్బంది సహాయంతో ఆమెను హుటాహుటిన కొండాపూర్‌లోని అపోలో ఆసుప‌త్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. మృతురాలి ముఖం, తల భాగంలో గాయాలు, వాపులు ఉండటంతో దీనిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించగా, వారు బస చేసిన గదిలోని గోడలు, బెడ్‌షీట్‌పై రక్తపు మరకలు కనిపించాయి. గదిలో ఖాళీ బీర్, విస్కీ బాటిళ్లు కూడా లభ్యం కావడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

నిఖిత మరణించిన విషయం తెలియగానే రవితేజ ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. దీంతో అతనిపై అనుమానాలు మరింత బలపడ్డాయి. అతని ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. రవితేజ ఫోన్ సిగ్నల్స్ చివరిసారిగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద నమోదై, ఆ తర్వాత స్విచ్ఛాఫ్ అయినట్లు పోలీసులు గుర్తించారు. 

ప్రస్తుతం క్లూస్ టీమ్ హోటల్ గదిలో కీలక ఆధారాలను సేకరిస్తోంది. హోటల్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు విశ్లేషిస్తున్నారు. 
Advertisement
Sharon Nikita Topno
Hyderabad OYO hotel death
Madhapur suspicious death case
Srinivasa Raviteja
Visakhapatnam girl death Hyderabad
Madhapur police investigation

More Telugu News