- టెన్త్ సర్టిఫికెట్ సవరణలు ఇకపై మీసేవ ద్వారానే
- మాన్యువల్, ఆఫ్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ రద్దు
- ఆన్లైన్లోనే దరఖాస్తుల పరిశీలన, ఆమోదం ప్రక్రియ
- పారదర్శకత, వేగవంతమైన సేవలే లక్ష్యమన్న విద్యాశాఖ
తెలంగాణలో పదో తరగతి (ఎస్ఎస్‌సీ) సర్టిఫికెట్లలోని వివరాల సవరణ ప్రక్రియను ప్రభుత్వం పూర్తిగా ఆన్‌లైన్‌లోకి మార్చింది. ఇకపై పేరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ వంటి మార్పుల కోసం విద్యార్థులు మీసేవ కేంద్రాల ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు మాన్యువల్ లేదా ఆఫ్‌లైన్ దరఖాస్తులను స్వీకరించబోమని, అన్ని జిల్లాల విద్యాధికారులకు, మండల విద్యాధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
కొత్త విధానం ప్రకారం, విద్యార్థులు మీసేవ కేంద్రంలో అవసరమైన డాక్యుమెంట్లతో దరఖాస్తు చేసుకున్న తర్వాత, ఆ దరఖాస్తును వారు చదివిన పాఠశాల హెడ్‌మాస్టర్‌కు ఆన్‌లైన్‌లో పంపుతారు. హెడ్‌మాస్టర్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌లో వివరాలు పరిశీలించి, అవసరమైన ధ్రువపత్రాలను ఐఎస్‌ఎంఎస్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసి, తమ అభిప్రాయంతో ఉన్నతాధికారులకు ఫార్వార్డ్ చేస్తారు.
అక్కడి నుంచి దరఖాస్తు మండల విద్యాధికారి (ఎంఈవో), జిల్లా విద్యాధికారి (డీఈవో) కార్యాలయాలకు వెళ్తుంది. వివిధ స్థాయిల్లో క్షుణ్ణంగా పరిశీలన పూర్తయ్యాక, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ తుది ఆమోదం తెలుపుతాయి. అనంతరం సవరించిన మెమోను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. విద్యార్థులు దానిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
గతంలో విద్యార్థులు ఫీజును బ్యాంకు చలాన్ ద్వారా చెల్లించి, మాన్యువల్‌గా దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది. ఈ విధానంలో జాప్యం జరుగుతోందని, కొత్త ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా పారదర్శకత పెరగడంతో పాటు సవరణలు వేగంగా పూర్తవుతాయని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఇకపై డైరెక్టర్ కార్యాలయానికి నేరుగా మాన్యువల్ ప్రతిపాదనలు పంపినా వాటిని పరిగణనలోకి తీసుకోబోమని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ స్పష్టం చేశారు.