ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. నేటి నుంచే అలాట్‌మెంట్ లెటర్లు!
- రాయదుర్గంలో రూ.750 కోట్ల విలువైన స్థలంలో కొత్త హౌసింగ్ టవర్లకు శంకుస్థాపన
- పూర్తయిన 21 వేల 2BHK ఇళ్లకు ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల ఎంపికకు ఆదేశం
- లక్కీ డ్రా ద్వారా పారదర్శకంగా ఇళ్ల కేటాయింపులు జరపాలని మంత్రి సూచన
- ఖాళీగా ఉన్న ఇళ్లను రద్దు చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు నేటి(సోమవారం) నుంచి అలాట్‌మెంట్ పత్రాలు జారీ చేయనున్నట్లు తెలంగాణ గృహ నిర్మాణ బోర్డు (టీజీహెచ్‌బీ) ప్రకటించింది. లబ్ధిదారుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు వాట్సప్, ఎస్ఎంఎస్‌ల ద్వారా ఈ పత్రాలను పంపనున్నారు. టీజీహెచ్‌బీ అధికారిక వెబ్‌సైట్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
మరోవైపు, శేరిలింగంపల్లి నియోజకవర్గం రాయదుర్గంలో నూతన ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. రూ.750 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో 480 ఫ్లాట్లను నిర్మించనున్నారు. మార్కెట్‌లో రూ.50 లక్షల విలువ చేసే ఫ్లాట్‌ను ఇక్కడ కేవలం రూ.6 లక్షలకే లబ్ధిదారులకు అందించనున్నారు.
అదే సమయంలో, హైదరాబాద్ పరిధిలో నిర్మాణం పూర్తయిన 21 వేల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నెలాఖరులోగా లక్కీ డ్రా ద్వారా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల సముదాయాలకు 5 నుంచి 7 కిలోమీటర్ల పరిధిలో నివసించే వారికే ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. అక్టోబర్ చివరికల్లా నీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు పూర్తి చేయాలని గడువు విధించారు.
"డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో అనర్హులుంటే వెంటనే తొలగించాలి. కేటాయించిన ఇళ్లలో నివసించని వారికి తుది నోటీసులు ఇచ్చి, వారి కేటాయింపులు రద్దు చేయాలి. ఆ ఇళ్లను కొత్తగా అర్హులైన వారికి ఇవ్వాలి" అని సమీక్ష సమావేశంలో మంత్రి అధికారులకు స్పష్టం చేశారు.