కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై ప్రభుత్వ దృష్టి.. రంగంలోకి రెవెన్యూ అధికారులు
- కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములపై ప్రభుత్వం చర్యలు
- సమీపంలోని ప్రభుత్వ భూములపై రెవెన్యూ అధికారుల ఆరా
- సర్వే నంబర్లు, పాత రికార్డుల సేకరణ
- అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటనతో కదలిక
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెందిన ఫామ్‌హౌస్ భూములపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం సమీపంలో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలను రెవెన్యూ అధికారులు సేకరిస్తున్నారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో నివేదికలు సిద్ధం చేస్తున్నారు.
ఫామ్‌హౌస్‌కు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూముల సర్వే నంబర్లు, గతంలో ఆ భూములను సాగు చేసిన రైతుల పేర్లు, ప్రస్తుత భూ రికార్డుల వివరాలతో అధికారులు సమగ్ర నివేదికలను రూపొందిస్తున్నారు.
కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములపై విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ప్రకటనకు అనుగుణంగానే అధికారులు ఇప్పుడు చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంపై దృష్టి పెట్టారు. కేసీఆర్ భూముల విస్తీర్ణం, వాటి స్వరూపంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ వివాదం కొనసాగుతున్న తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.