మోహన్ భగవత్ వీసా రద్దు చేయండి: అమెరికా ప్రభుత్వానికి కీలక కమిషన్ సూచన

Mohan Bhagwat Visa Cancellation Recommended by Key Commission to US Government
  • భగవత్‌తో పాటు ఆర్ఎస్ఎస్‌పైనా ఆంక్షలు విధించాలని యూఎస్ కమిషన్ సూచన
  • భారత్‌లో మైనారిటీలపై హింసాత్మక దాడులు జరుగుతున్నాయని ఆరోపణ
  • ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న మోహన్ భగవత్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్‌సంఘచాలక్ మోహన్ భగవత్‌ అమెరికా పర్యటనలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆయన వీసాను తక్షణమే రద్దు చేయాలని, ఆర్ఎస్ఎస్‌పై నిర్దిష్ట ఆంక్షలు విధించాలని యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ (యూఎస్‌సీఐఆర్ఎఫ్) అమెరికా ప్రభుత్వాన్ని కోరింది. భగవత్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న తరుణంలో ఈ సిఫార్సు వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది.

భారత్‌లో క్రైస్తవులు, దళితులు, ముస్లింలు, సిక్కులతో సహా మతపరమైన మైనారిటీలపై ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థలు హింసాత్మక దాడులకు పాల్పడుతున్నాయని ఈ సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ హిందుత్వ సిద్ధాంతాలకు అనుగుణంగా విధానాలను అమలు చేస్తోందని, ఇవి మైనారిటీల పట్ల వివక్షాపూరితంగా ఉన్నాయని ఆరోపించింది.

భారత్‌లో మత స్వేచ్ఛ క్షీణిస్తోందని, మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని హింసాత్మక, రెచ్చగొట్టే చర్యలు జరుగుతున్నాయని యూఎస్‌సీఐఆర్ఎఫ్ చైర్మన్ ఆసిఫ్ మహమూద్ పేర్కొన్నారు. మత స్వేచ్ఛ ఉల్లంఘనలకు పాల్పడుతున్న ఆర్ఎస్ఎస్ సభ్యులు, భారత అధికారులపై లక్షిత ఆంక్షలు విధించాలని ఆయన డిమాండ్ చేశారు. భగవత్ వీసాను రద్దు చేయడమే కాకుండా, భవిష్యత్తులో ఆయన అమెరికాలో ప్రవేశించకుండా అనర్హుడిగా ప్రకటించాలని కోరారు.

గోరక్షకుల దాడులు, మత మార్పిడి నిరోధక చట్టాలు, ఎన్ఆర్‌సీ, సీఏఏ వంటి అంశాలను కూడా కమిషన్ ప్రస్తావించింది. ఉత్తర అమెరికాలోని సిక్కులపై జరిగిన హత్యాప్రయత్నాల వెనుక భారత ప్రభుత్వం హస్తం ఉందని ఆరోపించింది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న మోహన్ భగవత్, న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో నిర్వహించ తలపెట్టిన ఒక కార్యక్రమంలో ప్రసంగించాల్సి ఉంది.
Advertisement
Mohan Bhagwat
RSS Visa Cancellation
USCIRF India Report
US Religious Freedom Commission

More Telugu News