భారత్ విజయానికి అడ్డుగోడలా దినుష.. రెండో టెస్టు డ్రా.. గిల్ సేనదే సిరీస్
- ఫాలో ఆన్ ఆడినా అద్భుత పోరాటంతో రెండో టెస్టును డ్రా చేసుకున్న శ్రీలంక
- అజేయ సెంచరీతో జట్టును ఆదుకున్న యువ కెరటం సోనల్ దినుష
- తొలి ఇన్నింగ్స్‌లో పడిక్కల్, ధ్రువ్ జురెల్ శతకాలతో భారత్ భారీ స్కోరు
- బౌలర్లకు సహకరించని పిచ్‌పై లంక బ్యాటర్ల అద్వితీయ నిలకడ
- ఈ సిరీస్‌లో మూడు సెంచరీలతో దినుష, 16 వికెట్లతో మానవ్ సుతార్ టాప్ పెర్ఫార్మర్లు
శ్రీలంక యువ బ్యాటర్ సోనల్ దినుష అద్భుతమైన ప్రతిఘటనతో భారత్ విజయానికి అడ్డుగోడలా నిలిచాడు. ఓటమి అంచున నిలిచిన జట్టును తన వీరోచిత సెంచరీతో ఆదుకుని, రెండో టెస్టును డ్రాగా ముగించడంలో కీలక పాత్ర పోషించాడు. ఫాలో ఆన్‌లో రెండో ఇన్నింగ్స్ ఆడిన శ్రీలంక, ఓటమి ఖాయమనుకున్న దశలో దినుష (133 నాటౌట్) అసాధారణ పోరాటపటిమతో భారత్ కు సవాలుగా నిలిచాడు. అతనికి ఇతర బ్యాటర్లు చక్కటి సహకారం అందించడంతో, కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుపు ఆశలు గల్లంతయ్యాయి.
మ్యాచ్ చివరి రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 429 పరుగులు చేసింది. అప్పటికే లంక ఆధిక్యం 216 పరుగులకు చేరింది. ఇవాళ ఆటకు చివరి రోజు కాగా, టీమిండియా గెలిచే అవకాశం లేకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను కాపాడుకున్న సోనల్ దినుషను భారత ఆటగాళ్లు, కోచ్ గౌతమ్ గంభీర్ ప్రత్యేకంగా అభినందించారు.
ఫాలో ఆన్‌లో లంక పోరాటం
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్, తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 503 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. దేవదత్ పడిక్కల్ (117), ధ్రువ్ జురెల్ (115) సెంచరీలతో కదం తొక్కగా, యశస్వి జైస్వాల్ (45), శుభ్‌మన్ గిల్ (50), రిషభ్ పంత్ (63) రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక 290 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్ల ధాటికి లంక బ్యాటర్లు చేతులెత్తేయగా, సోనల్ దినుష (103), పసిందు సూరియబండార (80) మాత్రమే రాణించారు. దీంతో భారత్‌కు 213 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
భారీ ఆధిక్యంతో శ్రీలంకను ఫాలో ఆన్‌కు ఆహ్వానించిన భారత్‌కు ఆతిథ్య జట్టు ఊహించని షాక్ ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లో లంక బ్యాటర్లు అద్భుతమైన పోరాటాన్ని ప్రదర్శించారు. పసిందు సూరియబండార (92), కమిందు మెండిస్ (55) రాణించగా, సోనల్ దినుష మరోసారి శతకంతో కదంతొక్కాడు. ఈ సిరీస్‌లో అతనికి ఇది మూడో సెంచరీ కావడం విశేషం. దినుషకు కేశర నువంత (46) తోడవడంతో లంక ఓటమి నుంచి గట్టెక్కింది. లంక టెయిలెండర్లు దాదాపు 90 ఓవర్ల పాటు క్రీజులో నిలబడి భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. బ్యాటింగ్‌కు పూర్తిగా అనుకూలించిన పిచ్‌పై భారత బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు.
భారత బౌలర్లలో ఈ సిరీస్ మొత్తం మీద మానవ్ సుతార్ 16 వికెట్లతో అగ్రస్థానంలో నిలవగా, లంక బౌలర్లలో అసిత్ ఫెర్నాండో 10 వికెట్లు పడగొట్టాడు. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ 1-0తో కైవసం చేసుకుంది.