ఫోర్బ్స్ ఇండియా ‘షో స్టాపర్స్ 2026’ కవర్ పేజీపై మెరిసిన అల్లు అర్జున్

Allu Arjun shines on Forbes India Showstoppers 2026 cover page
  • సినిమా విజయం సాధించాలంటే నటీనటుల స్టార్‌డమ్ సరిపోదన్న అల్లు అర్జున్
  • బలమైన కథ ఉంటేనే సినిమా విజయం సాధిస్తుందని వ్యాఖ్య
  • సరికొత్త కథలను ప్రేక్షకులకు అందించడమే ముఖ్యమన్న బన్నీ

గ్లోబల్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటారు. ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ 'ఫోర్బ్స్ ఇండియా' తాజాగా విడుదల చేసిన ప్రత్యేక సంచిక ‘షో స్టాపర్స్ 2026’ కవర్ పేజీపై ఆయన మెరిశారు. ఈ సందర్భంగా సినిమా పరిశ్రమ ప్రస్తుత పరిస్థితులు, కథల ప్రాముఖ్యతపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 


బాలీవుడ్, టాలీవుడ్ లేదా మరే ప్రాంతీయ సినిమా అయినా సరే బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలంటే కేవలం నటీనటుల స్టార్‌డమ్ సరిపోదని, బలమైన కథే ప్రధానమని అల్లు అర్జున్ స్పష్టం చేశారు. మంచి కంటెంట్ ఉంటే ఏ భాషతో సంబంధం లేకుండా సినిమా ఘన విజయం సాధిస్తుందని, సరికొత్త కథలను ప్రేక్షకులకు అందించడమే అన్నిటికంటే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.


2025 జనవరి నుంచి 2026 మార్చి వరకు సినిమా, ఓటీటీ, క్రీడలు, సంగీతం, టెలివిజన్ తదితర రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచి ప్రభావం చూపిన టాప్ 100 మంది ప్రముఖులతో 'ఫోర్బ్స్ ఇండియా' ఈ షో స్టాపర్స్ 2026 జాబితాను రూపొందించింది. ఈ ప్రఖ్యాత లిస్ట్‌లో అల్లు అర్జున్‌తో పాటు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, మోహన్‌లాల్, రామ్ చరణ్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్, ఏఆర్ రెహమాన్, బాబీ డియోల్, దుల్కర్ సల్మాన్, మాధవన్, రణ్‌వీర్ సింగ్, రిషబ్ శెట్టి, కల్యాణి ప్రియదర్శన్, కంగనా రనౌత్ తదితరులు చోటు దక్కించుకున్నారు.


Advertisement
Allu Arjun
Forbes India Showstoppers 2026
Forbes India Cover Page
Global Star Allu Arjun
Indian Cinema Trends
Forbes Top 100 Celebrities

More Telugu News