రకుల్ నోట శూర్పణఖ కథ.. తెలియని విషయాలు బయటపెట్టిన నటి!
- ‘రామాయణ’లో శూర్పణఖగా రకుల్
- పాత్రలోని అనేక కోణాలు ఆకర్షించాయని చెప్పిన హీరోయిన్
- స్క్రిప్ట్ ద్వారా శూర్పణఖ గురించి తెలియని విషయాలు తెలిసాయని చెప్పిన వైనం
- ముక్కు కోసిన ఘటనకు ముందు, తర్వాత జీవితం చూపిస్తారని వెల్లడి
- నవంబర్ 6న ‘రామాయణ: పార్ట్-1’ విడుదల
రామాయణంలో శూర్పణఖ అంటే చాలామందికి వెంటనే గుర్తుకొచ్చేది ప్రతినాయకురాలి పాత్రే. కానీ, 'రామాయణ' చిత్రంలో తాను పోషిస్తున్న శూర్పణఖ పాత్రలో అంతకుమించిన కోణాలున్నాయని నటి రకుల్ ప్రీత్ సింగ్ చెప్పింది. ఆ పాత్రలోని అనేక అంశాలు తనను ఈ సినిమా వైపు ఆకర్షించాయని తెలిపింది.
రావణుడి సోదరిగా శూర్పణఖ పాత్రలో రకుల్ కనిపించనుంది. లంకలో అత్యంత అందమైన మహిళల్లో ఆమె ఒకరని చెబుతారని రకుల్ గుర్తుచేసుకుంది. ఆమెకు అహంకారం ఉన్నప్పటికీ.. పాత్రలో చాలా కోణాలున్నాయని చెప్పింది. నటిగా అలాంటి పాత్రలను ఆవిష్కరించడం ఆసక్తికరంగా ఉంటుందని తెలిపింది.
స్క్రిప్ట్ చదివే వరకు శూర్పణఖ జీవితం గురించి తనకు తెలియని విషయాలు చాలానే ఉన్నాయని రకుల్ చెప్పింది. లక్ష్మణుడు ఆమె ముక్కు కోసిన ఘటనకు ముందు, తర్వాత జరిగిన పరిణామాలను సినిమాలో కొత్త కోణంలో చూపిస్తున్నట్లు వెల్లడించింది. రాముడిని శూర్పణఖ ఎలా కలుస్తుందన్న విషయాల్లోనూ కొత్త అంశాలు తెలుసుకున్నానని తెలిపింది.
రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్, సన్నీ డియోల్, రవి దూబే కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోంది. ‘రామాయణ: పార్ట్-1’ 2026 నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.